ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బలవంతపు భూసేకరణపై రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-09-08T06:31:39+05:30

పేదల భూములను బలవంతంగా లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిం చడంతో ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

రైతు కుటుంబీకులతో మాట్లాడుతున్న రామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనపర్తి, సెప్టెంబరు 7 : పేదల భూములను బలవంతంగా లాక్కోవడానికి అధికారులు ప్రయత్నిం చడంతో ఒక రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామంలో ల్యాండ్‌ సీలింగ్‌ ద్వారా మిగిలిన భూము లను 1990 ప్రాంతంలో సుమారు 30 మంది రైతు లకు ఎకరా చొప్పున పట్టాలు ఇచ్చారు. అయితే నాటి నుంచి నేటి వరకు వారు ఆ భూములను పండించు కుంటున్నారు. ఇటీవల పట్టాలు ఇచ్చిన భూములు ఇళ్ల స్థలాలకు అనువుగా ఉంటాయని వెనక్కి తిరిగి ఇవ్వాలని అధికారులు,ప్రజా ప్రతినిధులు కోరగా రైతులు వ్యతిరేకించారు.అయినా  బుధవారం అధికా రులు ఆ భూములను పరిశీలించేందుకు వచ్చారు. తాము భూమిని నమ్ముకుని  బతుకుతు న్నామని అమ్ముకోలేమని పేదలకు ఇవ్వడానికి మరెక్కడైనా భూ మిని సేకరించాలని రైతులు కోరారు.అయినా పట్టించు కోకుండా భూమిలో అధికారులు జెండాలు పాతడంతో తమకు ఇక భూమి మిగలదనే ఆవేదనతో రైతు దమ్ము శివ అధికారుల ఎదుటే  పురుగుల మందు సేవించి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధు వులు,స్థానికులు శివను బిక్కవోలులోని ప్రైవేటు ఆసు పత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలు చేరుకుని బాధితుడిని పరామర్శించారు.  

Updated Date - 2022-09-08T06:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising