‘సబ్‌ప్లాన్ చట్టం కాలపరిమితి పెంచాలి’
ABN, First Publish Date - 2022-12-15T00:25:27+05:30
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితిని పెంచాలని కుల వివక్ష వ్యతి రేక పోరాట సంఘం (కేవీపీఎస్) డిమాండు చేసింది.
అమలాపురం టౌన్, డిసెంబరు 14: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితిని పెంచాలని కుల వివక్ష వ్యతి రేక పోరాట సంఘం (కేవీపీఎస్) డిమాండు చేసింది. అమలాపురం బుద్ధ విహార్‌లో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పచ్చిమాల వసంతకుమార్ అధ్యక్షతన బుధవారం సమా వేశం జరిగింది. పదేళ్ల కాలపరిమితితో 2013లో తెచ్చిన సబ్‌ప్లాన్ చట్టం గడువు 2023 మార్చితో ముగియనుంద న్నారు. ఈచట్టం కాలపరిమితిని పెంచేందుకు వీలుగా చట్ట సవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు శెట్టిబత్తుల తులసీరావు, అయితాబ త్తుల ఈశ్వర్, వాకపల్లి హరీష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రేవు తిరుపతిరావు, వీసీకే పార్టీ జిల్లా కార్యదర్శి బొంతు రమణ, నిమ్మకాయల వెంకటేష్ ప్రసంగించారు.
Updated Date - 2022-12-15T00:25:28+05:30 IST