ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైన్‌మన్‌ను నియమించాలని అధికార పార్టీ నాయకుల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-27T06:54:45+05:30

గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ గోళ్ళ దండియ్య, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ తనమండ్ర కొండయ్య ఆధ్వర్యంలో గురువారం పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేశారు.

సబ్‌ స్టేషన్‌లో ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీకి తాళం.. గోపాలపురం సబ్‌ స్టేషన్‌ ముట్టడి 

విద్యుత్‌ సరఫరా నిలిపివేయించి 2 గంటల సేపు నిరసన

వేళ్లచింతలగూడెంలో ఘటన - తాత్కాలికంగా నియామకం

గోపాలపురం, మే 26: గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ గోళ్ళ దండియ్య, పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ తనమండ్ర కొండయ్య ఆధ్వర్యంలో గురువారం పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేశారు. లైన్‌మన్‌ సమస్య పరిష్కరించే వరకు పంచాయతీ, సచివాలయ సిబ్బంది,వలంటీర్లు ఎవరు పంచాయతీ కార్యాలయానికి రావద్దంటూ పిలుపునిచ్చారు. అనంతరం గోపాలపురంలోని విద్యుత్‌ ఉపకేంద్రానికి చేరుకుని కార్యాలయాన్ని ముట్ట డించి పెద్ద ఎత్తున ఆందోళన చే పట్టారు. లైన్‌మన్‌ను నియమించే వరకు సబ్‌స్టేషన్‌ పరిధిలో ఏ గ్రామానికి విద్యుత్‌ సరఫరా చేయడానికి వీల్లేదంటూ విద్యుత్‌ శాఖ అధికారులను పట్టుబట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికి అధికార పార్టీ నాయకులు లెక్కచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యుత్‌ శాఖాధికారులు విద్యుత్‌ నిలుపుదల చేశారు. సుమారు 2 గంటల పాటు విద్యుత్‌ ఉపకేంద్రం పరిధి లోని గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. ఉన్నతాధికారులు స్పందించి వేళ్లచింతలగూడెం గ్రామానికి తాత్కాలికంగా విద్యుత్‌ సేవలందించేందుకు వెంకటాయపాలెం, చెరుకుమిల్లి గ్రామాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ లైన్‌మన్‌ భాస్కరరావును నియమిస్తు న్నామని తెలపడంతో అధికార పార్టీ నాయకులు ఆందోళన ఉపక్రమించారు. కార్యక్ర మంలో ఎంపీపీ ఉండవల్లి సత్యనారాయణ, వైసీపీ మండల అధ్యక్షుడు వల్లి, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ వెలగా శ్రీరామమూర్తి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ముల్లంగి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు 

Updated Date - 2022-05-27T06:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising