ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్యాబ్‌ల పంపిణీలో సొమ్మసిల్లిన విద్యార్థిని

ABN, First Publish Date - 2022-12-31T00:24:42+05:30

ట్యాబ్‌ల పంపిణీ ఆలస్యంగా కావడంతో ఎండలో నిరీక్షించిన విద్యార్థిని సొమ్మసిల్లి పడిన సంఘటన కొండెవరం వీఎన్‌ఆర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి సబం ధించి 126మంది బాలికలకు ట్యాబ్‌ల పంపిణీ నిర్వహించారు. ఉద యం

విద్యార్థిని ఇంటికితీసుకెళ్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండెవరం (కొత్తపల్లి), డిసెంబరు 30: ట్యాబ్‌ల పంపిణీ ఆలస్యంగా కావడంతో ఎండలో నిరీక్షించిన విద్యార్థిని సొమ్మసిల్లి పడిన సంఘటన కొండెవరం వీఎన్‌ఆర్‌ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. ఉన్నత పాఠశాలలో 8వ తరగతికి సబం ధించి 126మంది బాలికలకు ట్యాబ్‌ల పంపిణీ నిర్వహించారు. ఉద యం 10.30గంటలకు జరిగే టాబ్‌ల పంపిణీ కార్యక్రమం కోసం విద్యార్థులను ఉదయం 9గంటలకే ఆరుబయట నిలబెట్టడంతో ఎండ తీవ్రతకు జె.స్రవంతి అనే 8వ తరగతి విద్యార్థిని సొమ్మసిల్లి కిందపడింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే వరండాలోకి తరలించి సపర్యలు చేపట్టారు. అనంతరం ఆమె తల్లిదండ్రు లు ఆటోలో ఇంటికి తీసుకెవెళ్లారు. విద్యార్థినికి లోబీపీ వచ్చిందని వెంటనే చికిత్ప చేయించామని హెచ్‌ఎమ్‌ జాన్‌ తెలిపారు. ట్యాబ్‌ల పంపిణీలో ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎండలో విద్యార్థులను నిలబెట్టడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-31T00:24:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising