ఉత్తి మాటలే!
ABN, First Publish Date - 2022-08-21T05:40:46+05:30
కాంట్రాక్టు పనులు చేసే వారికి ఒకప్పుడు కొదువే ఉండేది కాదు..
కట్టిన వాటికి బిల్లుల్లేవు.. కట్టబోయేవి కదలడం లేదు
అసంపూర్తిగా ప్రభుత్వ భవన నిర్మాణాలు
అప్పుల పాలైన పలువురు నాయకులు
బిల్లులందక లబోదిబో
రెండేళ్లగా కదలని పనులు
కోరుకొండ మండలంలో ఇదీ సీన్
కోరుకొండ ఆగస్టు 20 : కాంట్రాక్టు పనులు చేసే వారికి ఒకప్పుడు కొదువే ఉండేది కాదు.. మరిప్పుడో కాంట్రాక్టర్లు పనులు చేయాలంటేనే భయపడిపోతు న్నారు. దీంతో చాలా చోట్ల వైసీపీ నాయకులే రంగంలోకి దిగుతున్నారు. చివరకు చేతుల కాల్చుకుని ఏం చేయ లేక.. బిల్లులు అడగలేక లబోదిబోమంటున్నారు. కోరు కొండ మండలంలో సంఘటనే దీనికి ఉదాహరణ. మం డలంలో ఒక్కో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు రూ.2 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. గ్రామాల్లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఈ కాం ట్రాక్ట్ పనులు నాకు కావాలంటే నాకు కావాలని పోటీ పడ్డారు. ఎవరైతే పనులు ముందుగా పూర్తి చేస్తారో వారికి పనులు అప్పగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపధ్యంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎ స్సార్ హెల్త్ క్లినిక్, బల్క్‌మిల్క్ సెంటర్లకు నాలుగు భవనాలు మంజూరయ్యాయి. వీటిని దక్కించుకున్న కార్యకర్తలు కొన్ని గ్రామాల్లో అప్పులు చేసి ఆరునెలల వ్యవధిలో భవనాలు నిర్మించారు. అయితే రెండేళ్లవు తున్నా వాటికి పూర్తిగా బిల్లులు రాకపోవడంతో పోటీ పడి పనులు దక్కించుకున్న కార్యకర్తలు అప్పులు పాల య్యారు. కొందరు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి పరువు కాపాడుకునేందుకు పనులు పూర్తి చేశారు. మరికొందరు మధ్యలో చేతులు ఎత్తివేశారు. దీంతో కొన్ని గ్రామాల్లో ఆర్‌బీకేల నిర్మాణం పూర్తికాలేదు. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో ప్రారంభించిన సచివాలయ నూతన భవన నిర్మాణం మూడేళ్లవుతున్నా నేటికీ పూర్తి కాలేదు. గాదరాడ, జంబుపట్నం, కోటికేశవరం, తదితర గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. మరికొన్ని గ్రామాల్లో బల్క్ మిల్స్ సెంటర్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రెయినేజీలు నిర్మించిన వైసీపీ కార్యకర్తలు బిల్లులు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతు న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.
Updated Date - 2022-08-21T05:40:46+05:30 IST