ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-16T00:36:00+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాఫియా అవినీతి పాలన కొనసాగిస్తూ జగన్‌రెడ్డి ప్రభుత్వం దోచుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, డిసెంబరు 15: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాఫియా అవినీతి పాలన కొనసాగిస్తూ జగన్‌రెడ్డి ప్రభుత్వం దోచుకుంటుందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల బుచ్చిబాబు విమర్శించారు. గురువారం తాళ్లరేవు ఆర్యవైశ్యసంఘ భవనం లో టీడీపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ అమలాపురం పార్లమెంటు ఇన్‌చార్జి గంటి హరీష్‌మాధుర్‌ బాలయోగి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని ప్రశ్నించే వారిపై అధికార వర్గాలు దౌర్జన్యాలకు దిగుతున్నారని, ఈ పాలనను ప్రజలు అంతమొందించాలన్నారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రభుత్వాలు ప్రజాథనాన్ని దోచుకుంటున్నాయని ప్రజలు రౌడీప్రభుత్వాలకు బుద్దిచెబుతారని అన్నారు. కార్యక్రమం అనంతరం తాళ్లరేవు చెరువుగట్టు సెంటరు రోడ్డుగుంటలలో ఇదేం ఖర్మ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగసూర్యనారాయణ, మోపూరి వెంకటేశ్వరరావు, వుంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, కుడిపూడి రామకృష్ణ, ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో సీఎం జగన్‌

సర్పవరం జంక్షన్‌: ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలో సీఎం జగన్‌ ఉన్నారని, వైసీపీ పాలనలో పేదలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి దుర్మార్గపాలనకు చరమగీతం పాడాలని కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణమూర్తిలు పిలుపునిచ్చారు. నేమాంలో పార్టీ శ్రేణులతో కలసి నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కర్రి వెంకట్రాజు, తాతపూడి రామకృష్ణ, వాసంశెట్టి లోవబాబు, వి.సత్యనారాయణ, పండూరి జయకృష్ణ,మాతా లక్ష్మణ్‌, జి.రమణ, కె.సూరిబాబు పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌: కాకినాడ రూరల్‌ నియోజక వర్గాన్ని అభివృద్ధిచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని కాకినాడ రూర ల్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి అన్నారు. రూరల్‌మండలం రేపూరులో ఇంటింటికీ మీ అనంతలక్ష్మి, ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని మాజీ ఎంపీటీసీ పెండెం కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్తిబాబు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వమే ప్రజలకు పెద్దసమస్య అన్నారు.

శని వదలాలి, చంద్రబాబు పాలన రావాలి

తొండంగి: రాష్ట్రానికి శనిలా పట్టిన వైసీపీ పాలనపోయి చంద్రబాబు పాలన రావాలని దీని కోసం ప్రజలంతా కలిసి రావాలని తుని టీడీపీ ఇన్‌ఛార్జి యనమల కృష్ణుడు పేర్కొన్నారు. గురువారం నర్షిపేట, తాటియాకులపాలెం గ్రామాల్లో రాష్ట్రానికి ఇదేంఖర్మ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీకి బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కోడ వెంకట రమణ, హరికృష్ణ పాల్గొన్నారు.

ప్రత్తిపాడు: మండలంలోని శరభవరం గ్రామంలో గురు వారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు అమరాది వెంకట్రావు, యూనిట్‌ ఇన్‌చార్జ్‌లు బొల్లు వెంకటేశ్వ రరావు, అమరాది దొరబాబులు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి అధికార వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదు ర్కొంటున్న అవస్థలు వివరించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని వారు తెలిపారు. మండల టీడీపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సామర్లకోటలో ఇదేమి ఖర్మ నిరసన కార్యక్రమాలు

సామర్లకోట: సామర్లకోట పట్టణ పరిధిలో 5,6 వార్డులలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి పేరిట నిరసన కార్యక్రమాలు గురువారంరాత్రి నిర్వహించారు. పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు అడబాల కుమార స్వామి, బడుగు శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు టీడీపీ పొ లిట్‌ బ్యూరోసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అమరజీవి పొట్టి శ్రీరా ములు చిత్రపటానికి, డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే చినరాజప్ప తదితర పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులులర్పించారు. అనంతరం ఆయా వార్డుల ప్రజలనుద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు రానున్న ఎన్నికలలో చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కంటే బాబు, యార్లగడ్డ చిన్నీ, అందుగుల జార్జి చక్రవర్తి, తాతపూడి కృష్ణబాబు, తాతపూడి అరుణ్‌ వంశీ, బాడితమాని త్రిమూర్తులు, గొలితి సత్యనారాయణ, పడాల వీరబాబు పాల్గొన్నారు.

వైసీపీ పాలనలో నగర అభివృద్ధి శూన్యం

కాకినాడ సిటీ: వైసీపీ పాలనలో కాకినాడ నగర అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. టీడీపీ రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక 13వ డివిజన్‌ సాంబమూర్తినగర్‌ ప్రాంతంలో వైసీపీ పాలనలో ఇదేమీ ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడా లోటు లేకుండా చంద్రబాబు పాలన సాగించారన్నారు. వైసీపీ నాయకులు గడపగడపకు అంటూ ప్రజల మధ్యకు వెళ్తుంటే నిలదీ స్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాకినాడ కార్పొరేషన్‌ను అవినీతి కార్పొరేషన్‌గా మార్చి దోచుకుంటున్నారని ఆరోపించా రు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్‌ వొమ్మి బాలాజీ, గదుల సాయిబాబు, ఎంఏ తాజుద్దీన్‌, గాది శివరామకృష్ణ, కళ్యాణపు నాగరాజు, అరదాడి శివ, పోలిపల్లి జగన్‌, తుమ్మల సునీత, కొల్లు కుమారి, మీసాల సునీత, మూగు చిన్ని, పీర్ల లక్ష్మీప్రసన్న, దూడ పావని పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising