ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికలను వేధిస్తే చర్యలు తీసుకోరా?

ABN, First Publish Date - 2022-12-15T23:48:21+05:30

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలో పోలీసు, ఐటీడీఏ అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, డిసెంబరు 15: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కాకవాడ ఆశ్రమ పాఠశాలలో గిరిజన బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలో పోలీసు, ఐటీడీఏ అధికారులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ రవిబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరం వచ్చిన చైర్మన్‌కు ఈ ఘటనలో పోలీసులు, ఐటీడీఏ అధికారులు స్పందించిన తీరుపై సెంటర్‌ ఫర్‌ రైట్స్‌ అధ్యక్షుడు బాలు అక్కిస, గిరిజన సంఘం నాయకులు చేసిన ఫిర్యాదు చేశారు. తీవ్రంగా స్పందించిన ఆయన హుటాహుటిన కాకవాడ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. తమపై జరిగిన లైంగిక వేధింపులు, ఇతర పరిస్థితులను బాలికలు రోదిస్తూ కమిషన్‌ చైర్మన్‌కు, ఎమ్మెల్యే ధనలక్ష్మికి వివరించారు. దీంతో చైర్మన్‌ తీవ్రంగా స్పందించారు. ఘటన జరిగి పది రోజులు గడిచినా సాక్షాత్తూ ఎమ్మెల్యే ధనలక్ష్మి సమక్షంలో బాలికలు తమపై జరిగిన లైంగిక వేధింపులను, అందుకు బాధ్యులెవరన్నది ఫిర్యాదు చేసినా చట్ట ప్రకారం నేటికీ చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. గిరిజన బాలలకు విద్యాలయాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలిగినా సహించలేని పరిస్థితులు ఉంటే, ఏకంగా బాలికలపైనే ప్రధానోపాధ్యాయురాలి భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిసి కూడా పోలీసులు, ఐటీడీఏ అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రంపచోడవరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహనకుమార్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాస్‌ను ఛైర్మన్‌ నిలదీశారు. గిరిజన బాలికలు తమపై సాగిన లైంగిక వేఽధింపులను ఫిర్యాదు చేసినపుడు పోలీసులు కేసు నమోదు చేయలేదని అన్నారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి కూడా ఈ లైంగిక వేధింపులు తెలిసినా తీవ్రంగా స్పందింలేదన్నారు. ఘటనను నీరుగార్చే చర్యలకు కొందరు అధికారులు ఒడిగట్టారని, ఇక్కడ ఎటువంటి సంఘటనా జరగలేదని చెప్పాలని విచారణకు వచ్చిన అధికారులే ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చారని ఎమ్మెల్యే ధనలక్ష్మి ఛైర్మన్‌ దృష్టికి తెచ్చారు. బాలికలు, ఉపాధ్యాయులు, విద్యాకమిటీ ప్రతినిధులతో మాట్లాడిన అనంతరం కమిషన్‌ ఛైర్మన్‌ చోటు చేసుకున్న నిర్లక్ష్యాన్ని గుర్తించి తక్షణ చర్యలు చేపట్టి కమిషన్‌కు తెలియబర్చాలని లేని పక్షంలో ఎస్టీ కమిషనే స్పందించి అధికారులపై కూడా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధనలక్ష్మితో పాటు ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చిచ్చడి మురళీ, రంపచోడవరం జడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising