ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలానికో స్పెషలాఫీసర్‌

ABN, First Publish Date - 2022-04-29T07:03:07+05:30

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణకు 21 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఇప్పటివరకూ నియోజకవర్గ స్థాయిలో ఒకరు, మండలస్థాయిలో మరొక అధికారి స్పెషల్‌ ఆఫీసర్లుగా ఉండగా ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు
  • 21 మండలాలకు జిల్లాస్థాయి అధికారుల నియామకం
  • అన్నింటి బాధ్యత వారిదే

పిఠాపురం, ఏప్రిల్‌ 28: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పర్యవేక్షణకు 21 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఇప్పటివరకూ నియోజకవర్గ స్థాయిలో ఒకరు, మండలస్థాయిలో మరొక అధికారి స్పెషల్‌ ఆఫీసర్లుగా ఉండగా ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించారు. జిల్లాల పునర్విభజన అనంతరం పాలన వ్యవహారాల్లో మార్పులు వస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు నాడు-నేడు, ఎంపీ ల్యాడ్స్‌, సీఎస్‌ఆర్‌, సీఎండీఎఫ్‌ తదితర పథకాల అమలు, వార్డు, గ్రామ సచివాలయాల పనితీరు, పేదలందరికీ ఇళ్లు సహా హౌసింగ్‌ స్కీంలు, నవరత్నాల అమలు తదితరాలను మండలస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ జిల్లాలోని 21 మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కృతికాశుక్లా ఉత్తర్వులు జారీ చేశారు.

ఏ మండలానికి ఏ అధికారి అంటే..

కాకినాడ అర్బన్‌ మండలానికి మునిసిపల్‌ కమిషనర్‌ నాగనరసింహారావు, గొల్లప్రోలు పట్టణం, మండలానికి కుడా వైస్‌చైర్మన్‌ కె.సుబ్బారావు, కాకినాడ రూరల్‌కు ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ డీఎస్‌ సునీత, కరపకు జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.మయూరి, పెదపూడికి ఏపీఎంఐపీ పీడీ ఎస్‌.రామ్మోహన్‌, పిఠాపురం పట్టణం, మండలానికి జిల్లా వ్యవసాయాధికారి ఎన్‌.విజయకుమార్‌, సామర్లకోట పట్టణం, మండలానికి కాకినాడ ఆర్డీవో బీవీ రమణ, తాళ్లరేవుకు కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ కె.లక్ష్మీనరసయ్య, యు.కొత్తపల్లికి సెట్రాజ్‌ సీఈవో ఎం.శ్రీనివాసరావు, కాజులూరు మండలానికి జిల్లా పరిశ్రమల అధికారి బి.శ్రీనివాసరావు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. పెద్దాపురం డివిజన్‌ పరిధిలోని కిర్లంపూడి మండలానికి డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసరు కేఎన్‌వీ ప్రసాద్‌, కోటనందూరు మండలానికి జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి ఎస్‌.సూర్యప్రకాశరరావు, పెద్దాపురం పట్టణం, మండలానికి ఆర్డీవో సీతారామారావు, రౌతులపూడికి జిల్లా ఉద్యానవనశాఖాదికారి బీవీ రమణ, శంఖవరం మండలానికి నెడ్‌కాప్‌ డీఎం పీవీ రామరాజు, తొండంగికి జిల్లా మహిళా శిశు సంక్షేమాదికారిణి కె.ప్రవీణ, తుని పట్టణం, మండలానికి సెజ్‌ డిప్యూటీ కలెక్టరు కె.మనోరమ, ఏలేశ్వరం పట్టణం, మండలానికి బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్వీఎస్‌ సుబ్బలక్ష్మి, గండేపల్లికి ఏపీజీడీసీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టరు సుధారాణి, జగ్గంపేటకు జిల్లా మార్కెటింగ్‌ అధికారి కేఆర్‌ఆర్‌ నాగేశ్వరరావు, ప్రత్తిపాడుకు జిల్లా సాంఘిక సంక్షేమాధికారి జె.రంగలక్ష్మిదేవిలను ప్రత్యేకాధికారులుగా నియమించారు.

Updated Date - 2022-04-29T07:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising