సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ABN, First Publish Date - 2022-08-04T06:11:32+05:30
సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే చెప్పారు.
రాజవొమ్మంగి ఆగస్టు 3: సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే చెప్పారు. జడ్డంగి ప్రభుత్వాసుపత్రిలో మండలంలోని వైద్య సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. రాజవొమ్మంగిలో నిర్మాణంలో ఉన్న ఏకలవ్య పాఠశాల కోసం సిబ్బందితో మాట్లాడి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడ్డతీగల మండలం గొంటువానిపాలెం నుంచి ఏలేశ్వరం వరకు రోడ్డు దయనీయంగా ఉందని రోడ్డు పనులు త్వరగా జరిగేలా చూడాలని ఎంపీపీ గోము వెంకటలక్ష్మి పీవోకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి పీహెచ్‌సీలో గర్భిణిలను డెలివరీకి 15 రోజులు ముందుగానే ఆస్పత్రిలో చేరేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని పీవో సూచించారు. చెరుకుంపాలెంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వైవీ సుబ్రహ్మణ్యాచార్యులు, ఎంపీడీవో బాపన్నదొర, ఏడీఎంహెచ్‌వో అనూష, సర్పంచ్‌ల సమైఖ్య అధ్యక్షుడు కొంగర మురళీకృష్ణ, ఏఎంవో రామకృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-08-04T06:11:32+05:30 IST