ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల విలీనంపై వ్యతిరేకత

ABN, First Publish Date - 2022-01-22T05:24:59+05:30

మూడు కిలోమీటర్లలోపు ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేయడంపై తల్లిదండ్రులు, పిల్లల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్‌కు ఉపాధ్యాయుల వినతి

కరప, జనవరి 21: మూడు కిలోమీటర్లలోపు ప్రాఽథమిక, ప్రాఽథమికోన్నత పాఠశాలలను హైస్కూళ్లలో విలీనం చేయడంపై తల్లిదండ్రులు, పిల్లల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కరప మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిఽథిగా విచ్చేసి ప్రసంగించారు. మన బడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుచేయనున్న విద్యావిధానంలోని మార్పులపై అభిప్రాయాలు సూచనలు చెప్పాలని ఆయన కోరారు. పాఠశాలల విలీనం, మ్యాపింగ్‌ విషయంలో ఇబ్బందులు ఉంటే తెలియజేయాలన్నారు. దీంతో పలువురు హెచ్‌ఎంలు లేచి పాఠశాలల విలీనంపై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.  కనీసం గ్రామానికి ఒక ప్రైమరీ పాఠశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వీటన్నింటిపై కూలంకుషంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భం గా విద్యాశాఖ తరపున ఆయనను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, ఎంఈవో కొప్పుల బులికృష్ణవేణి, హైస్కూళ్ల హెచ్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-22T05:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising