ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు బాధ్యత ఉపాధ్యాయులదే : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-07T01:59:02+05:30

నాడు -నేడు పథకం నిధులతో పాఠశాలలు, కళాశాలలను ఆహ్లాదకరం గా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు ప్రభుత్వ బాలుర, బా లికల జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను మంగళవారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.

కొవ్వూరు ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో తరగతి గదులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత.. మధ్యాహ్న భోజన వంటకాలను పరిశీలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, డిసెంబరు 6 : నాడు -నేడు పథకం నిధులతో పాఠశాలలు, కళాశాలలను ఆహ్లాదకరం గా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ కె.మాధవీలత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు ప్రభుత్వ బాలుర, బా లికల జూనియర్‌ కళాశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను మంగళవారం కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి, పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. వందేళ్ల చరిత్ర కలిగిన కళాశాల భవనం బయటవైపే కాకుండా, లోపలి భాగంలోనూ మరమ్మతులు చేపట్టాలన్నారు. అయితే ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా తరగతి గదుల్లో పరిశుభ్రత నిర్వహణ లోపంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై ఉపాధ్యాయులు వ్యక్తిగత దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం స్కూల్‌ నిర్వహణ నిధులు (ఎస్‌ఎమ్‌ఎఫ్‌), టాయిలెట్‌ నిర్వహణ నిధులు (టీఎమ్‌ఎఫ్‌)లను వేర్వేరుగా కేటాయిస్తున్నప్పటికీ నిర్వహణ విషయంలో అలసత్వం చూ పిస్తే ఎలా అని ప్రశ్నించారు. డీవైఈవో తిరుమలదాసును నేను ఒక్క పనే చేయగలనని రాతపూర్వకంగా రాసిస్తే అదనపు విధుల నుంచి తొలగిస్తామని కలెక్టర్‌ స్పష్టంచేశారు. పాఠశాలల్లో నాడు నేడు కింద మంజూరైన పనులను సరైన విధానం లో నిర్వహణ చేపట్టే బాధ్యతను ఉపాధ్యాయులు స్వీకరించాలన్నారు. అనంతరం బియ్యం, కోడిగుడ్లు, మధ్యాహ్న బోజన పథకంలో తయారుచేసిన ఆహార పదార్థాలను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.

కాసేపు టీచర్‌గా.. కలెక్టర్‌!

కొవ్వూరు, డిసెంబరు 6: విద్యపై పట్టు సాధిస్తే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలమని కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. కొవ్వూ రు ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలు, గవర్నమెంటు హైస్కూల్‌ విద్యార్థులతో మంగళవారం మాట్లాడారు. విద్యార్థు లతో కొద్దిసేపు పాఠ్యాంశాలను దగ్గరుండి చదివించారు. అందరికీ చదవడం వచ్చా అని ప్ర శ్నించారు. అవసరమైతే రెండు గంటలు తరగతి గదిలో కూర్చుని చదివిస్తానన్నారు. ప్రతి రోజు గంటసేపు పాఠ్యాంశాలను చదివించేలా అన్ని కళాశాలలకు వారికి సర్క్యులర్‌ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - 2022-12-07T01:59:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising