ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీలను టార్గెట్‌ చేసిన ఎక్సైజ్‌ సీఐపై చర్య తీసుకోండి

ABN, First Publish Date - 2022-09-24T06:54:42+05:30

రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వెంకటనగరంలో ఎస్సీలను టార్గెట్‌ చేసి పీడీ యాక్ట్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతన్న నార్త్‌ ఎక్సైజ్‌ సీఐ పి.వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని గ్రామ దళితులు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలెక్టర్‌కు బాధితుల వినతి 

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 23: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం వెంకటనగరంలో ఎస్సీలను టార్గెట్‌ చేసి పీడీ యాక్ట్‌ల పేరుతో వేధింపులకు పాల్పడుతన్న నార్త్‌ ఎక్సైజ్‌ సీఐ పి.వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని గ్రామ దళితులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన నిర్వహించి అటుపై కలెక్టర్‌ మాధవీలతకు తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీలపై సీఐ అన్యాయంగా కేసులు పెడుతున్నారని, రాజమహేంద్రవరంలో గౌడ కులస్థుల్లో కొందరు సారా వ్యాపారం చేస్తుంటే వారిని వదిలి అన్యాయంగా తమపై పీడీయాక్ట్‌ పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. సారా కేసుల్లో సంబంధం లేని వారిని ఇరికిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. తమపై కేసులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తే దానికి దాడి చేసినట్టు త్రీటౌన్‌లో తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. వల్లూరి హరికృష్ణ, కాగిత వెంకటేశులుపై పీడీ యాక్ట్‌లు పెట్టారని, ఇప్పుడు అదేగ్రామానికి చెందిన సబ్బిత దుర్గారావుపై పీడీ యాక్ట్‌ పెట్టడానికి ప్రయతిస్తున్నారని చెప్పారు. గౌడలను వదిలి మాలలను ఇరికించి వేధిస్తున్న సీఐ నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎం.రమేష్‌, కె.శ్రీను, జి.భీముడు, కె.వీరవెంకట్రావు, నారాయణ, కృష్ణ, నాని, రాజు, వెంకన్న, అర్జయ్య, కిరణ్‌ సుమారు 200మంది దళితులు, మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-24T06:54:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising