ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీఏపీ ధరలకు రెక్కలు!

ABN, First Publish Date - 2022-09-19T05:48:17+05:30

సామర్లకోట, సెప్టెంబరు 18: మండలంలోని పలు ప్రాంతాల్లో డీఏపీ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యవ సాయశాఖ నిర్దేశించిన మేరకు డీఏపీ బస్తా రూ.1,350 చొప్పున విక్రయించాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.1550 చొప్పున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతగా పెంపు, డీఏపీ ఎరువుల ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులు డీఏపీ, యూరియా క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, సెప్టెంబరు 18: మండలంలోని పలు ప్రాంతాల్లో డీఏపీ ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి. వ్యవ సాయశాఖ నిర్దేశించిన మేరకు డీఏపీ బస్తా రూ.1,350 చొప్పున విక్రయించాల్సి ఉండగా రూ.1500 నుంచి రూ.1550 చొప్పున విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతగా పెంపు, డీఏపీ ఎరువుల ధరలు స్వల్పంగా పెరగడంతో రైతులు డీఏపీ, యూరియా కలిపి వినియోగించడం ప్రారంభి ంచా రు. దీంతో డీఏపీకి మార్కెట్లో డిమాండ్‌ వచ్చింది. ఇదే అదనుగా వ్యాపారులు డీఏపీ ధరలు పెంచేశారు. మండలంలోని పలు గ్రామాల్లో డీలర్లు డీఏపీ బస్తా ధర రూ.1,500 నుంచి రూ.1,550 చొప్పున విక్రయిస్తున్నట్టు రైతు సంఘాలు చేసిన ఫిర్యాదులు సైతం జిల్లా వ్యవసాయాధికారులకు అందినా అధికారులు ఎవరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోపక్క వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో సమృద్ధిగా డీఏపీ ఎరువులు లేకపోవడమే వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేకపోయారన్న ఆరోపణలు కూడా వినిపస్తున్నాయి. కొందరు వ్యాపారులు డీఏపీ కావాలంటే కాంప్లెక్స్‌ ఎరువులు లింక్‌ కలిపి అమ్ముతున్నారని రైతు లు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలకు ఎరువులను అందుబాటులో ఉంచకపోవడం, గతంలో విక్రయించే సోసైటీలకు ఎరువుల విక్రయాలు నిలుపుదల అంశాలతో రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పంట కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-09-19T05:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising