ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పు నీరు రాకుండా చర్యలు చేపట్టాలి: రైతులు

ABN, First Publish Date - 2022-09-08T06:48:47+05:30

కేశవదాసుపాలెం గ్రామంలో 500 ఎకరాల వరి పంట పండే సాగుభూమిలో గుర్రపుడెక్క (ప్రేమనగర్‌) అనే పువ్వు రైతుల పాలిట శాపంగా మారిం దని రైతులు వాపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, సెప్టెంబరు 7:  కేశవదాసుపాలెం గ్రామంలో 500 ఎకరాల వరి పంట పండే సాగుభూమిలో గుర్రపుడెక్క (ప్రేమనగర్‌) అనే పువ్వు రైతుల పాలిట శాపంగా మారిం దని రైతులు వాపోయారు. ఉప్పునీటితో మునిగిన వరి పొలా లను, గుర్రపుడెక్కతో ఉన్న పొలాలను పరిశీలించాలని కేశవ దాసుపాలెం రైతులు కోరారు. వ్యవసాయాధికారి పీవీ నర సింహారావుతో కలసి తహశీల్దార్‌ రమాకుమారి కేశవదాసు పాలెంలో పొలాలను పరిశీలించారు. గుర్రపుడెక్క తీయడానికి ఎకరానికి రూ.30వేలు ఖర్చవుతుందని రైతులు తహశీల్దార్‌కు విన్నవించుకున్నారు. పంట పొలాలను ఆను కుని ఒక డ్యామ్‌ నిర్మించ పోవడంతో  పొలాల్లో ఉప్పు నీరు చేరడంతో సార్వా, దాళ్వా వరి నాట్లు వేయకుండా ఖాళీగా ఉంచి తీవ్ర నష్టాలకు గురవుతున్నామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో క్రాప్‌ హాలీడే ప్రకటిస్తున్నామని తహశీల్దార్‌, వ్యవ సాయాధికారికి రైతులు వివరించారు. ఈసమస్య శృంగవరప్పాడు, గొంది, మోరిపోడు, మోరి, అంతర్వేది, గ్రామాల్లో కూడా ఉందన్నారు. ఉండపల్లి పండు, ఉండపల్లి అంజి, బెల్లంకొండ పుత్రయ్య, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌  పాల్గొన్నారు.  



Updated Date - 2022-09-08T06:48:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising