ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సాగునీరు, ఎరువుల కొరత లేకుండా చూడాలి’

ABN, First Publish Date - 2022-01-21T05:30:00+05:30

రబీ సాగుకు అవసరమైన ఎరువులు, సాగునీరు కొరత లేకుండా చూడాలని రైతులు, వ్యవసాయ సలహాసంఘం సభ్యులు అధికారులను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరప, జనవరి 21: రబీ సాగుకు అవసరమైన ఎరువులు, సాగునీరు కొరత లేకుండా చూడాలని రైతులు, వ్యవసాయ సలహాసంఘం సభ్యులు అధికారులను కోరారు. కరపలో శుక్రవారం మండలస్థాయి వ్యవసాయ సలహాసంఘం సమావేశం జరిగింది. మండల వ్యవసాయ సలహాసంఘం అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, ఏవో ఎ.గాయత్రీదేవి ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థాయి ఎడ్వయిజరీ బోర్డు చైర్మన్‌లు, సభ్యులు, రైతులు సాగునీటి ఎద్దడి రాకుండా రబీని గట్టెక్కించాలని కోరారు. రైతుభరోసాకేంద్రాల్లో డీఏపీ ఎరువు దొరకడంలేదని, మండలానికి చెందిన అర్హులైన రైతులకు మాత్రమే సరఫరా చేయాలని విజ్ఞప్తిచేశారు. ఆర్డీవో మాట్లాడుతూ రబీకి సాగునీరు పూర్తిస్థాయిలో అందించడానికి అవసరమైన అన్నిచర్యలు తీసుకున్నామని, ఎరువులు అందుబాటులో ఉంచామని స్పష్టంచేశారు. ఈనెల 25వ తేదీ నుంచి వంతుల వారీ విధానం అమల్లోకి వస్తుందని ఇరిగేషన్‌ ఏఈ కె.సుబ్బారావు తెలిపారు. నడకుదురులో పశువుల ఆసుపత్రి భవనం పూర్తికాక విధులు నిర్వహించలేకపోతున్నామని పశువైద్యాధికారి రవికిరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కురసాల కన్నబాబుతో మాట్లాడి త్వరితగతిన భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి హామీ ఇచ్చారు. తహశీల్దార్‌ పి.శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ సలహా సంఘం సభ్యుడు బొండా చంటిబాబు, తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising