ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల స్థలాల్లో సచివాలయ భవనాలు

ABN, First Publish Date - 2022-06-27T06:56:26+05:30

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనే పలుచోట్ల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని ఖాళీ చేయించి వేరే భవనాల్లోకి మార్పు చేశారు. అయితే కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 13 భవనాల నిర్మాణం చేపట్టారు.

ఇందుపల్లి భట్లపాలెంలో ప్రభుత్వ పాఠశాల స్థలంలో నిర్మిస్తూ నిలిచిన సచివాలయ భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కోర్టు ఆదేశాలతో జిల్లాలో నిలిచిన తొమ్మిది భవనాల నిర్మాణం

అమలాపురం రూరల్‌, జూన 26: ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. సచివాలయ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు  ప్రభుత్వ పాఠశాలల్లోనే పలుచోట్ల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని ఖాళీ చేయించి వేరే భవనాల్లోకి మార్పు చేశారు. అయితే కోనసీమ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో 13 భవనాల నిర్మాణం చేపట్టారు. ఒక్క అమలాపురం రూరల్‌ మండలంలోనే మూడు సచివాలయ భవనాల పనులను ఇదే తరహాలో ప్రారంభించగా అవన్నీ కోర్టు ఆదేశాలతో వివిధ దశల్లో నిలిచిపోయాయి. చేసిన పనులకు బిల్లుల రాక ఏళ్లు గడిచిపోతుండడంతో కాంట్రాక్టర్లు లబోదిబో మంటున్నారు. అమలాపురం రూరల్‌ మండల పరిధిలోని బండారులంక వల్లూరువారిపేట, ఇందుపల్లి భట్లపాలెం, గున్నేపల్లి అగ్రహారం ప్రాథమిక పాఠశాలల స్థలాల్లోనే సచివాలయాల నిర్మాణాలు చేపట్టగా కోర్టు ఆదేశాలతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటికి విముక్తి ఎప్పుడు కలుగుతుందో చెప్పలేని పరిస్థితి.




Updated Date - 2022-06-27T06:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising