ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిక్కిరిసిన వాడపల్లి

ABN, First Publish Date - 2022-08-14T07:35:57+05:30

శ్రీదేవి భూదేవి సమేత కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో శనివారం వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.13.36 లక్షలు

ఆత్రేయపురం, ఆగస్టు 13: శ్రీదేవి భూదేవి సమేత కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో  శనివారం  వేలాదిమంది భక్తులు  స్వామివారిని దర్శించుకున్నా రు. వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి  శ్రీవారిని  స్వర్ణశోభితుడిని చేశారు. ఉభయ రాష్ట్రాల నుంచి అశేషభక్తజనం స్వామివారికి ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఉభ య గోదావరి జిల్లాల నుంచి వేలాదిమంది  భక్తులు కాలినడకన స్వామి సన్నిధికి చేరుకుని తలనీలాలు, కానుకలు సమ ర్పించుకున్నారు. గోవిందనామస్మరణతో భారీ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవలద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.13,36,993 లభించినట్టు చైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో సతీష్‌రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రాజమహేంద్రవరంనకు చెందిన ఎస్‌.నాగేశ్వరరావు, రేవతి దంపతులు రూ.27, 675 విరాళం సమర్పించారు. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది.



Updated Date - 2022-08-14T07:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising