ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధం

ABN, First Publish Date - 2022-05-15T07:01:59+05:30

నియోజకవర్గంలో జరుగుతున్న ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధమని టీడీపీ పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, మే 14: నియోజకవర్గంలో జరుగుతున్న ఏ దోపిడీని నిరూపించడానికైనా సిద్ధమని టీడీపీ పార్లమెంటు జిల్లా అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొంగూర గడ్డ లంకలో భూవివాదంలో వాడపల్లిలో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులు సవాల్‌ విసిరారని, కాని వాడపల్లిలో కాకుండా ప్రెస్‌క్లబ్‌లో కూర్చుందాం రావాలని ఆయన అన్నారు.  ఇసుక ర్యాంపుల్లో దోపిడీని అరికట్టడానికి ఇరు పార్టీల తరపున రోజు ర్యాంపుల్లో తనిఖీలు చేపట్టి దోపిడీని అరికడదామని కలసి రావాలన్నారు. నవంబర్‌ నెల నుంచి లంకలో అనుమతులు లేకుండా పాలచెట్లు నరికివేస్తున్నారన్నారు. వట్టికూటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కుమారదేవం ఇసుకర్యాంపులో బాట చార్జీలపేరుతో దోపిడీ చేస్తున్నారు. ముత్యాల రాంబాబు మాట్లాడుతూ  ఓపెన్‌ ర్యాంపులను తెరిచి పూడికతీత ర్యాంపులను మూసివేసి, ఇసుక కార్మికుల పొట్టకొట్టారన్నారు. అవినీతికంపులో మునిగిపోయిన మీకు సవాల్‌లు విసిరే అర్హతలేదన్నారు. హోం మంత్రి తక్షణం స్పందించి, దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-15T07:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising