ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రాయలవారి మహామంత్రాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి’

ABN, First Publish Date - 2022-08-10T06:53:23+05:30

శ్రీకృష్ణదేవరాయలు తన జీవితమంతా ఆచరించి అనుసరించిన దైవం-ధర్మం-ధైర్యం-శౌర్యం అనే మహామంత్రాన్ని నేటి యువతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందాలని పలువురు వక్త లు పేర్కొన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఆగస్టు 9: శ్రీకృష్ణదేవరాయలు తన జీవితమంతా ఆచరించి అనుసరించిన దైవం-ధర్మం-ధైర్యం-శౌర్యం అనే మహామంత్రాన్ని నేటి యువతరం మననం చేసుకుంటూ స్ఫూర్తి పొందాలని పలువురు వక్త లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయ యూత్‌ ఫౌండేషన్‌ రాష్ట్రశాఖ ఆధ్వర్యం లో మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో రాయలవారి పట్టాభిషేక దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మ హో టత్సవ్‌లో భాగంగా నల్లా అజయ్‌, అడపా ప్రకాష్‌ ఆధ్వర్యంలో ప్రొఫె సర్‌ ఆలపటి రామకృష్ణ, అడ్డాల గోపాలకృష్ణ రాయలవారి చిత్రపటానికి పుష్పాలంకరణచేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీని వాసుని అనుగ్రహంగా పొందిన మహామంత్రంతో యువత జాతీయ పతా కాలతో భారత్‌మాతాకు జై, మేరా భారత్‌మహాన్‌ అంటూ నినాదాలు చేశారు. 

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం

అమలాపురం టౌన్‌, ఆగస్టు 9: క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందామం టూ సీఐటీయూ, ఏఐ టీయూసీ ప్రజా సం ఘాల ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంక టేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌, ఏఐటీయూసీ జి ల్లా కార్యదర్శి వాసంశెట్టి సత్తిరాజు, ఊటాల వెంకటేష్‌ మాట్లాడారు. రా నున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలకు పిలుపు నిచ్చా రు. ప్రజా సంఘాల నాయకులు నిమ్మకాయల శ్రీనివాస్‌, కామిరెడ్డి చంద్ర రావు, సకిలే సూర్య నారాయణ, పాము బాలయ్య, జగడం నాగేశ్వర రావు, కె.బేబీగంగారత్నం, బి.రాణి, నిమ్మకాయల వెంకటేష్‌, వి.హరీష్‌, కురసా నాగేశ్వరరావు, ఉండవల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-10T06:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising