ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంపచోడవరం ఐటీడీఏ పీవోగా ధనుంజయ బాధ్యతల స్వీకారం

ABN, First Publish Date - 2022-04-13T06:11:08+05:30

రంపచోడ వరం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీ డీఏ) ప్రాజెక్టు అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో పాడేరు జిల్లా జాయింట్‌ కలె క్టర్‌ ఎస్‌.ధనుంజయ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, ఏప్రిల్‌ 12: రంపచోడ వరం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీ డీఏ) ప్రాజెక్టు అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలతో పాడేరు జిల్లా జాయింట్‌ కలె క్టర్‌ ఎస్‌.ధనుంజయ మంగళవారం బాధ్యత లు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఏజెన్సీలో మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం అందించే పథకాల ను అర్హులైన వారందరికీ చేరవేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. 

ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలి: పీవో

 ప్రభుత్వాసుపత్రులలో గిరిజనులకు మెరుగైన వై ద్యం అందించాలని జా యింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఎస్‌.ధనుంజయ వై ద్యాధికారులను ఆదేశించా రు. ఐటీడీఏ కార్యాలయం లో మంగళవారం ఆయన వివిధ శాఖల ఇంజనీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆస్పత్రు ల్లో అందిస్తున్న వైద్యసేవలు, మలేరియా స్ర్పేయింగ్‌ నిర్వహణపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సమర్పించాలన్నారు. అలాగే ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుకో వాలని సూచించారు. వివిధ ఇంజనీరింగ్‌శాఖల ద్వారా చేపట్టిన పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, నాబార్డు నిధులతో చేస్తున్న పనులపై ఆరా తీశారు. ఏజెన్సీలో నూతనంగా 45రోడ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అఽధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈలు డేవిడ్‌రాజు, ఐ.శ్రీనివాస రావు, డీఈలు గౌతమి, వై.వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్‌, రాజేంద్ర బాబు, ఏఈలు సత్యనారాయణ, నాగరాజు, మహేష్‌, పి.వెంకటేశ్వర్లు, అబ్బాయి దొర, డీఎస్‌వో బీఎస్‌ కుమార్‌, ఎస్‌వో భాస్కరరావు పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-13T06:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising