సమస్యల తక్షణ పరిష్కారానికి ‘జనబాట’
ABN, First Publish Date - 2022-03-05T05:32:16+05:30
ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించడమే జన బాట ముఖ్యోద్దేశ్యమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పాతతుంగ పాడులో నిర్మించిన రైతుభరోసా కేంద్రాన్ని, వైఎస్సాఆర్ హెల్త్‌క్లినిక్ భవనాలను శుక్రవారం ప్రారంభించారు.
దివాన్‌చెరువు, మార్చి 4: ప్రజా సమస్యలను తక్షణం పరిష్కరించడమే జన బాట ముఖ్యోద్దేశ్యమని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. పాతతుంగ పాడులో నిర్మించిన రైతుభరోసా కేంద్రాన్ని, వైఎస్సాఆర్ హెల్త్‌క్లినిక్ భవనాలను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పాతతుంగపాడు, కొత్తతుంగపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన జనబాట-2 కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను స్వీకరించారు. అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యెరుబండి రాంబాబు, కోలపాటి వెంకన్న, ఉపసర్పంచ్ వెంకటలక్ష్మి, ఎంపీ టీసీలు ఉంగరాల గోవిందరాజు, రౌతుల లక్ష్మీపతి, జడ్పీటీసీ వాసంశెట్టి పెద వెంకన్న, ఎంపీపీ మండారపు సీతారత్నం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:32:16+05:30 IST