ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టాలు తెలిశాయి!

ABN, First Publish Date - 2022-03-05T06:57:20+05:30

దేవీపట్నం మండలం ఇందుకూరిపేట-1 కాలనీలో శుక్రవారం సీఎం జగన్‌, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌లతో జరిగిన పోలవరం నిర్వాసితుల సభ అనుకోని మలుపు తిరిగింది. ప్రభుత్వం తమ గొప్పలు చెప్పుకోవడానికి వేదికగా చేసుకోవాలని అనుకోగా, నిర్వాసితులు తమ కష్టాలు కేంద్రమంత్రికి తెలిసేలా వినియోగించుకున్నారు.

ఇందుకూరిపేట-1లోని పునరావాస కాలనీ సందర్శన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి షెకావత్‌,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేంద్రమంత్రి నోట .. నిర్వాసితుల బాధల మాట
  • సభలో కష్టాలు ఏకరువు పెట్టిన నిర్వాసితులు
  • జీవనోపాధికి ఏదైనా చేయాలని కేంద్రమంత్రి షెకావత్‌ ఉద్ఘాటన
  • చెప్పినమాట ప్రకారం పరిహారం ఇస్తామన్న సీఎం జగన్‌
  • ఇందుకూరిపేట-1 కాలనీ, అంగన్‌వాడీ కేంద్రం సందర్శించిన నేతలు
  • ఇందుకూరిపేట సభతో అనేక సమస్యలు వెలుగులోకి
  • ఉపాధి కోల్పోయిన లక్షా 5 వేల కుటుంబాలు
  • భారీ పోలీసు బందోబస్తు మధ్య జగన్‌, షెకావత్‌ పర్యటన

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

దేవీపట్నం మండలం ఇందుకూరిపేట-1 కాలనీలో శుక్రవారం సీఎం జగన్‌,  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌లతో జరిగిన పోలవరం నిర్వాసితుల సభ అనుకోని మలుపు తిరిగింది. ప్రభుత్వం తమ గొప్పలు చెప్పుకోవడానికి వేదికగా చేసుకోవాలని అనుకోగా, నిర్వాసితులు తమ కష్టాలు కేంద్రమంత్రికి తెలిసేలా వినియోగించుకున్నారు. ప్రధానంగా తమ జీవనోపాధి సమస్యను  ప్రభుత్వాల దృష్టికి తేవడంలో సక్సెస్‌ అయ్యారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కూడా పరిస్థితి అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేయడం విశేషం. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు ఒక లక్షా 5 వేల కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. అటవీ ప్రాంతంలోని వారి గ్రా మాల నుంచి బయటకు తీసుకొచ్చి పునరావాస కాలనీలకు తరలిస్తుండడంతో, అడవిలో ఏవో పనులు చేసుకుని, చెట్టూపుట్టా, పశువులతోనూ, వ్యవసాయంతోనూ బతికేవారు. వాళ్లలో చాలామంది ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడంతోపా టు, కొందరిని పునరావాస కాలనీలకు కూడా తరలించారు. ఎక్కువమందిని ఒకేచోట పెట్టడం వల్ల వారికి పనులేమీ లేకుండా పోయాయి. వీటిపై చాలాకాలం నుంచి నిర్వాసితులు ఆందోళన చెందుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇవాళ కేంద్రమంత్రి షెకావత్‌, సీఎం జగన్‌ పాల్గొన్న సభలో నిర్వాసితులైన మడకం  పోచమ్మ, సత్యనారాయణరెడ్డి చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి. వీటిపై వేదిక మీదే సీఎం, మంత్రి చర్చించుకున్నారు. అనంతరం మంత్రి షెకావత్‌ మాట్లాడుతూ వందేళ్ల చెట్టును టెక్నాలజీ సహకారంతో మరొక చోట పాతినా.. అది బతుకుతుందనే గ్యారంటీ లేదని, అలానే ఏళ్ల తరబడి ఒక ప్రాంతంలో బతికిన ప్రజలను వేరేచోట కాలనీలకు తరలించి వదిలేస్తే సరిపోదని, వారి బతుకు, ఇబ్బందులు కూడా పట్టించుకోవాలని సూచించారు. అంటే నిర్వాసితుల బాధలు ఆయనకు నేరుగా అర్ధమైనట్టే. నిర్వాసితులు ఉపాధి హామీని 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని కోరుతున్నారు. దానితోపాటు వ్యవసాయమూ, ఇతర ఉపాధి అవకాశాలు కూడా కల్పించవలసి ఉంది. పోలవరం కోసం త్యాగం చేసిన ఈ ప్రజల్లో విద్యావంతులు కూడా ఉన్నారు. వారిని కూడా ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి చేసేలోపే  అందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, భూమికి భూమి, పునరావాస కాలనీలు కూడా సమకూర్చవలసిన అవసరం ఉంది. నిర్వాసితులు సమస్యల గురించి ఏకరవు పెడుతున్న సమయంలో సభికుల నుంచి హర్షధ్వానాలు వచ్చాయంటే, అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇందుకూరిపేట-1 కాలనీలో తురస వెంకన్నదొర ఇంటిని సీఎం జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ పరిశీలించి, అక్కడ వెంకన్నదొర దంపతులతో కలసి ఒక మంచం కూర్చుని అక్కడి పరిస్థితి గురించి, ఇంట్లో సౌకర్యాల గురించి ఆరా తీశారు. కేంద్రమంత్రి వారిని నవ్విస్తూ మాట్లాడారు. మరొకరి ఇంటిని కూడా సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో ఇద్దరూ మాట్లాడారు. అంతకుముందు వైసీపీ నేతలు తెచ్చిన గిరిజన కొమ్ములను ధరించారు.

చెప్పిన మాట ప్రకారం పరిహారం..

తాను గతంలో చెప్పిన మాట ప్రకారం  పరిహారం ఇస్తానని సీఎం జగన్‌ ప్రకటించారు. కేంద్రం ఇచ్చే పరిహారంతో అదనంగా కొంత ఇచ్చి మొత్తం రూ. 10 లక్షలు ఇస్తానని గతంలో ఆయన ప్రకటించారు. 2006 ముందు ఇచ్చిన పరిహారం తక్కువగా ఉండడంతో దానిలోటు పూర్చి రూ.5 లక్షలు దక్కేలా చేస్తానని, ఇచ్చిన హామీని కూడా నెరవేరుస్తానని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని, అందరూ బాగుండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, ఎంపీలు మార్గాని భరత్‌రామ్‌, మాధవి, ఎమ్మెల్సీలు  అనంత ఉదయభాస్కర్‌, తోట త్రిమూర్లులు, ఎమ్మెల్యేలు ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి,  చిర్ల జగ్గిరెడ్డి, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, జేసీ భార్గవ్‌తేజ, పీవో ప్రవీణ్‌ ఆదిత్య, సబ్‌కలెక్టర్లు కట్టా సింహాచలం, ఇలాక్కియా, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డి.దొరబాబు పాల్గొన్నారు.

ఒకే హెలికాఫ్టర్‌లో...

సీఎం జగన్‌, కేంద్రమంత్రి షెకావత్‌ ఒకే హెలికాఫ్టర్‌లో వచ్చారు. తిరిగి ఒకే హెలికాఫ్టర్‌లో పోలవరం వెళ్లారు. నిర్ణీత సమయానికి 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఈ నేతల పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పా టుచేశారు. అడుగడుగునా పోలీసులు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో వందలాది మంది పోలీసులు ఇక్కడే మోహరించారు.

Updated Date - 2022-03-05T06:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising