ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గర్భిణులను ఆసుపత్రులలో చేర్పించాలి: ఐటీడీఏ పీవో

ABN, First Publish Date - 2022-05-25T05:36:01+05:30

గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందు ఆస్పత్రుల్లో చేర్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో గనోరే సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  రంపచోడవరం, మే 24: గర్భిణులను ప్రసవానికి 15 రోజులు ముందు ఆస్పత్రుల్లో చేర్పించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో గనోరే సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం  ఆయన వైద్యశాఖాఽధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గర్భిణిలను ప్రసవానికి ముందు ఆసుపత్రులలో చేర్చి సుఖ ప్రసవాలు చేయించే బాధ్యత సంబంధిత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీల ప్రహరీలను ఉపాధి హామీ నిధులతో నిర్మించుకోవాలని సూచించారు. పీహెచ్‌సీలకు మరమ్మతులుంటే ప్రతిపాదనలు ిసిద్ధం చేసి సమర్పించాలన్నారు. మలేరియా నిర్మూలనకు ప్రతి ఇంట్లో దోమల మందు పిచికారీ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ వో అనూష, వైద్యాధికారులు నందకిశోర్‌, ప్రభాత్‌, నరేష్‌, మలేరియా నివారణ అధికారి రామకృష్ణ, ఏడు మండలాల హెడ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 

నాడు-నేడు పనులు ప్రారంభించాలి

ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లుల కమిటీలతో తీర్మానించి నాడు-నేడు పథకం ద్వారా మంజూరైన పనులు ప్రారంభించాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో గనోరే సూరజ్‌ ధనుంజయ్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు ఎం.ముక్కంటితో కలిసి 11 మండలాల విద్యాశాఖాధికారులతో నాడు-నేడు పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మట్లాడుతూ నాడు-నేడు ఫేజ్‌-2 ద్వారా మంజూరైన పనుల్లో భాగంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రఽధానోపాధ్యాయులను ఆదేశించారు. నాడు-నేడు పనులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడో తరగతి విద్యార్థులకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైస్కూళ్లలో జాయిన్‌ చేసేందుకు ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు మల్లేశ్వరరావు, తాతబ్బాయి, బాలరాజు, ఏఎంవో ఎస్‌.దేవప్రసాద్‌, సీఎం ప్రసాద్‌, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-25T05:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising