విద్యుత్ పొదుపుగా వాడాలి
ABN, First Publish Date - 2022-12-15T00:13:51+05:30
విద్యుత్ పొదుపుగా వినియోగించాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలను బుధవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్ వద్ద ప్రారంభించి మాట్లాడారు.
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు14: విద్యుత్ పొదుపుగా వినియోగించాలని కలెక్టర్ మాధవీలత అన్నారు. విద్యుత్ పొదుపు వారోత్సవాలను బుధవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్ వద్ద ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ పొదుపు చేయడం ప్రపంచానికి చాలా అవసరమని అన్నారు.ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్.మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయడానికి ఇందన వనరులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత శ్రద్ధ కనబరుస్తుందన్నారు. విద్యుత్ పొదుపు కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక పఽథకాలు అమలు చేశామని చెప్పారు. అందులో భాగంగా 25.76 లక్షల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ, 2973 ఎనర్జీ ఎఫిసియెట్ మోటార్స్ రైతులకు ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు. రైతులకు 3,940 సోలార్ వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ర్యాలీ రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయం వరకు సాగింది.కార్యక్రమంలో ఈఈ నక్కపల్లి శామ్యూల్ ,విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎన్‌జీవోలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:13:55+05:30 IST