ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2022-05-25T05:39:42+05:30

కొవ్వూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పీవో డి.మమ్మీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, మే 24: కొవ్వూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పీవో డి.మమ్మీ తెలిపారు. కొవ్వూరులోని శ్రీరామకాలనీ-1, 5వ వార్డు బీసీ లోకేషన్‌, 14వ వార్డు, ఆశోకా పబ్లిక్‌ స్కూల్‌, మండలంలోని దొమ్మేరు-4, వేములూరు-4, పెనకనమెట్ట సావరం, మద్దూరు-1 ఆయాల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. కనీస విద్యార్హత 10వ తరగతి పాసై, స్థానిక వివాహిత మహిళలై ఉండాలన్నారు. వయస్సు 21 నుంచి 35 సంవత్సరాలలోపు వారై ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు నివాస, కులము, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, 10వ తరగతి మార్కుల లిస్టు, పుట్టిన తేదీ, అంగవైకల్యం, భర్త మరణించినచో మరణ ధ్రువీకరణ పత్రం, మైనర్‌ పిల్లలు వుంటే ధ్రువీకరణ పత్రాలు, ప్రీస్కూల్‌ ట్రైనింగ్‌ పత్రాలు ఈ నెల 25వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కార్యాలయంలో అందజేయాలన్నారు.

Updated Date - 2022-05-25T05:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising