ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు అఽధరహో

ABN, First Publish Date - 2022-07-06T06:45:54+05:30

పొగాకు రికార్డు ధరకు అమ్మకం జరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

గోపాలపురం పొగాకు వేలం కేంద్రంలో సాగుతున్న అమ్మకాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేజీ రూ.231కి చేరి రికార్డు - రైతుల ఆనందం


గోపాలపురం, జూలై 5 : పొగాకు రికార్డు ధరకు అమ్మకం జరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గోపాలపురం వేలం కేంద్రంలో మంగళ వారం కిలో పొగాకు కనిష్ఠ ధర రూ.120 పలకగా గరిష్ట ధర రూ.230 పలికింది.సరాసరి ధర రూ.183.74 పైసలు పలికినట్లు అధికారులు తెలిపారు. పొగాకు వేలం కేంద్రంలో గరిష్ఠ ధర రూ.228 పలకగా కనిష్ఠ ధర రూ.130 పలికింది. దీంతో సరాసరి ధర రూ.195.94 పైసలు పలికినట్లు అయింది. ఈ ఏడాది మొదటి నుంచి పొగాకు ధర రూ.195తో ప్రారంభమై స్థిరంగా నిలిచింది. వ్యాపారులు కొనుగోలులో పూర్తిస్థాయిలో పాల్గొనక పోవడంతో ధరలు అంతంతమాత్రంగానే పెరిగి నిలకడగా ఉండేది. నిన్న మొన్నటి వరకు క్రమక్రమంగా రూ.216 రూపాయలు గరిష్టంగా పెరిగిన పొగాకు ధర అంతర్జాతీయ మార్కెట్‌లో పొగాకు కొరత ఏర్పడింది. కంపెనీలకు మంచి ఆఫర్లు తేవడంతో వ్యాపారులంతా వేలంలో పాల్గొని పొగాకు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. దీంతో కిలో పొగాకు గరిష్ట ధర రూ.231 చేరింది. దీంతో చిన్నా సన్నకారురైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక పక్క పొగాకు ధరలు పెరుగుతున్నాయన్న ఆనందం కన్న్నా ఈ పరిణామం రానున్న రోజుల్లో పొగాకు సాగు పై తీవ్ర ప్రభావం చూపుతుందని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు.  


ఇప్పటికే 80 శాతం రైతులు విక్రయించేశారు..


ఇప్పటికే పొగాకు కొనుగోలులో 80 శాతాన్ని రైతులు విక్రయించారు. ఇప్పటి వరకు పలికిన పొగాకు ధర సరాసరి ధర అదే విధంగా కొనసాగితే సరిపోయేది. పొగాకు అమ్మకాలు పూర్తవుతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ధర పెంచడం భవిష్యత్‌లో పొగాకు సాగుకు ఇబ్బందికరంగా మారనుంది. 

- గెడా భాస్కరరావు, పొగాకు రైతు రాజంపాలెం


Updated Date - 2022-07-06T06:45:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising