ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్వానంగా వీధిలైట్ల నిర్వహణ

ABN, First Publish Date - 2022-11-30T23:34:35+05:30

వీధిలైట్ల నిర్వహ ణ అధ్వానంగా ఉందని, నెలల తరబడి దీపాలు వెలగకుండా వీధులు అంధకారంలో ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్‌హాలులో బుధవారం జరిగిన కౌ

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం కౌన్సిల్‌ సభ్యుల ఆగ్రహం

పిఠాపురం, నవంబరు 30: వీధిలైట్ల నిర్వహ ణ అధ్వానంగా ఉందని, నెలల తరబడి దీపాలు వెలగకుండా వీధులు అంధకారంలో ఉంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్‌హాలులో బుధవారం జరిగిన కౌన్సిల్‌ సాధారణ సమావేశానికి చైర్‌పర్సన్‌ గండేపల్లి సూర్యావతి అధ్యక్షత వహించారు. టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లవరపు నగేష్‌ మాట్లాడుతూ పట్టణంలో ప్రధానమయిన ఉప్పాడ సెంటర్‌ నుంచి గల డివైడర్‌పై లైట్లు వెలగడం లేదని ఫిర్యాదుచేస్తున్నా ఫలితం లేకపోయిందన్నారు. కౌన్సిలర్లు పెదపాటి రాజేష్‌, బోను దేవ, వైస్‌చైర్మన్‌ పచ్చిమళ్ల జ్యోతి మాట్లాడుతూ వీధిదీపాల నిర్వహణకు పనిచేస్తున్న సిబ్బందికి 4నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. డీఈఈ భవానీశంకర్‌ మాట్లాడుతూ త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, వీధిలైట్లకు మరమ్మతులు నిర్వహిస్తామని తెలిపారు. పట్టణంలో పందుల సమస్యకు ఇంతవరకూ పరిష్కారం ఎందుకు చూపలేకపోయారని తలిశెట్టి వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుళాయిలు, పైపులైన్లకు లీకేజీలు ఉంటున్నాయని, కనెక్షన్లు వేసిన తర్వాత గోతులు పూడ్చడం లేదని సోమరౌతు లలితాదేవి తెలిపారు. పంపనబోయిన అన్నపూర్ణ, ముమ్మిడి రత్నసుజిత తదితరులున్నారు.

Updated Date - 2022-11-30T23:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising