జగన్ చేసిన మోసాన్ని ఎండగడదాం
ABN, First Publish Date - 2022-12-31T00:04:51+05:30
రాష్ట్రంలో యువతకు సీఎం జగన్ చేసిన మోసాన్ని ఎండగడదామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ పిలుపునిచ్చారు. లోకేష్ త్వరలో చేపట్టనున్న యువగళం పాదయాత్రపై పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్ర
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
పిఠాపురం, డిసెంబరు 30: రాష్ట్రంలో యువతకు సీఎం జగన్ చేసిన మోసాన్ని ఎండగడదామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్ వర్మ పిలుపునిచ్చారు. లోకేష్ త్వరలో చేపట్టనున్న యువగళం పాదయాత్రపై పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత కోసం లోకేష్ జనవరి 27న కుప్పం నుంచి ప్రారంభించి 400రోజులు పాటు 4వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారన్నారు. రాష్ట్ర, యువత భవిష్యత్తు కోసం లోకేష్ ఈ పాదయాత్ర చేపట్టారని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు గానూ 09686296862కు మిస్‌డ్‌కాల్ ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని వర్మ సూచించారు. సమావేశంలో తెలుగుయువత, టీఎన్‌ఎ్‌సఎఫ్, ఐటీడీపీ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T00:04:52+05:30 IST