ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌తో ఉద్యోగులకు అనర్థం

ABN, First Publish Date - 2022-06-07T07:10:15+05:30

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 6: ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌)తో ఉద్యోగులకు అనర్థం కలుగుతుందని, తక్షణమే సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, జూన్‌ 6: ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం (జీపీఎస్‌)తో ఉద్యోగులకు అనర్థం కలుగుతుందని, తక్షణమే సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యూటీఎఫ్‌) జిల్లా కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విలీనం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసి, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ నూతన విద్యావిధానం వల్ల జరిగే నష్టాలు-పర్యవసానాల గురించి తెలిపారు. నూతన విద్యా విధానం వల్ల విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడిందని, కాపాడుకోవడానికి ప్రజలు, విద్యావేత్తలు ఉద్యమించాలని అన్నారు. జీపీఎస్‌తో జరిగే నష్టాలను తెలియజేస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లా కన్వీనర్‌ ఏ.షరీఫ్‌ మాట్లాడారు. 

తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ ఏర్పాటు..

అధ్యక్షుడిగా పి.జయకర్‌(నిడదవోలు), ప్రధాన కార్యదర్శిగా ఏ.షరీఫ్‌ (కోరుకొండ) ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షుడిగా పి.శంకరుడు(దేవరపల్లి), అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఐ.రాంబాబు(ఉండ్రాజవరం), అసోసియేట్‌ అధ్యక్షురాలిగా ఎం.విజయగౌరి(రంగంపేట), కోశాధికారిగా ఈవీఆర్‌ఎస్‌ ప్రసాద్‌(కడియం),కార్యదర్శులుగా మల్లిపూడి రాజు, ఈ.శ్రీమణి, జేవీ సుబ్బారావు, డి.మహాలక్ష్మి, ఆర్‌.సురేష్‌కుమార్‌, బి.విజయ్‌బాబు, వి.వెంకటరమణ, డీవీవీ సత్యనారాయణ, ఎస్‌వీవీ తాతారావు, ఎన్‌.రవిబాబు, కె.రమేష్‌బాబును ఎన్నుకున్నారు.

Updated Date - 2022-06-07T07:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising