ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కింగ్‌ మాఫియాకు అడ్డుకట్ట

ABN, First Publish Date - 2022-07-18T05:55:13+05:30

పెద్దాపురం, జూలై 17: మరిడమ్మ దేవస్థానం వద్ద పార్కింగ్‌ మాఫియా ఆగడాలకు మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర అడ్డుకట్ట వేశారు. ఆశీలపాటదారుడికి వార్నింగ్‌ ఇచ్చారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెచ్చిపోతున్న పార్కింగ్‌ మాఫియా పే

పార్కింగ్‌ ఫీజులు చెల్లించవద్దంటూ ఏర్పాటు చేసిన బోర్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసులకు ఫిర్యాదు 

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌ 

పెద్దాపురం, జూలై 17: మరిడమ్మ దేవస్థానం వద్ద పార్కింగ్‌ మాఫియా ఆగడాలకు మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర అడ్డుకట్ట వేశారు. ఆశీలపాటదారుడికి వార్నింగ్‌ ఇచ్చారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 17న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రెచ్చిపోతున్న పార్కింగ్‌ మాఫియా పేరుతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. దేవస్థానం పరిసరాల్లో పార్కింగ్‌ చేసుకున్న వాహనాలకు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన పనిలేదంటూహెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. దీంతో ఆలయానికి వచ్చే పలువురు భక్తులు మున్సిపల్‌ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

జాతరకు భక్తుల రద్దీ 

మరిడమ్మ జాతరకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ రామ్మోహనరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైసీపీ నాయకులు కర్రి వెంకటరమణ, గోలి దొరబాబు, వీరంరెడ్డి శ్రీనివాస్‌ భక్తులకు ప్రసాదాలను వితరణ చేశారు. జాతరకు వచ్చిన భక్తుల కోసం ఏర్పాట్లను డీసీ విజయరాజు పర్యవేక్షించారు.

Updated Date - 2022-07-18T05:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising