ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ విధానాలపై పోరాటం

ABN, First Publish Date - 2022-12-31T01:06:03+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 30: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో యువతరానికి పగ్గాలు అప్పగించడంలో అఽధినాయకత్వం విజయవంతమైందన్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిన నాటి నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించానని, ఇప్పుడు కాకినాడ, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో పర్యటిస్తానన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని,అవినీతిపరులకు కొమ్ముకాస్తోందని అన్నారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఇలాంటి సంఘటనలు లేవు, దేశంలో ప్రజాస్వామ్య విలువలతో కాంగ్రెస్‌ పాలన చేసిందన్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన జోడో పాదయాత్రను ప్రజలు విజయవంతం చేస్తున్నారని చెప్పారు. వచ్చేనెల 26న ఈ పాదయాత్ర ముగుస్తుందని,26, 27 తేదీల్లో కాంగ్రెస్‌ పోరాటం ప్రారంభమవుతుందన్నారు.సమావేశంలో బోడా వెంకట్‌, బాలేపల్లి మురళీధరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising