‘ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి పింఛన్లు పీకేస్తారా’
ABN, First Publish Date - 2022-12-31T23:28:01+05:30
ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏళ్ల తరబడి అవ్వా తాతలు పొందుతున్న పింఛన్లను పీకేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గొల్లప్రోలు, డిసెంబరు 31: ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఏళ్ల తరబడి అవ్వా తాతలు పొందుతున్న పింఛన్లను పీకేశారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పింఛన్లు పీకేసీ మీ పాట్లు మీరు పడండంటూ వారిని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. పింఛన్ మొత్తాన్ని పెంచామని గొప్పలు చెప్పుకుంటూ ఆ భారాన్ని తగ్గించుకునేందుకే జగన్ ఈ విధం గా చేశారని విమర్శించారు.
‘వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి దుర్భరం’
తొండంగి, డిసెంబరు 31: వైసీపి పాలనలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని తుని టీడీపీ ఇన్ఛార్జి యనమల కృష్ణుడు విమర్శించారు. శనివారం ఏకొత్తపల్లిలో జరిగిన రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే నాథుడులేక కళ్ళాల్లో ధాన్యం కళ్ళలో కన్నీరుతో రైతులు కొత్తసంవత్సరంలోకి ప్రవేశిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కార్యదర్శి పేకేటి హరి కృష్ణ,పార్టీ మండల శాఖ అధ్యక్షులు చొక్కా అప్పారావు, మురాలశె ట్టి సత్యన్నారాయణ, వనపర్తి రాజా, తదితరలు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలి
తాళ్లరేవు: అవినీతి అక్రమాల వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ క్లస్టర్ ఇన్చార్జీ టేకుమూడి లక్ష్మణరావు అన్నారు. శనివారం జి.వేమవరం గ్రామంలో కట్టా త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఇదేంకర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. దౌర్జన్య దగాకోరు ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపాలన్నారు.
Updated Date - 2022-12-31T23:28:02+05:30 IST