ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలి: చినరాజప్ప

ABN, First Publish Date - 2022-09-29T06:59:45+05:30

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక లూథరన్‌ హైస్కూల్‌ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు బుధవారం చేపట్టారు.

నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు
పెద్దాపురం, సెప్టెంబరు 28 : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక లూథరన్‌ హైస్కూల్‌ ఎదురుగా రిలే నిరాహార దీక్షలు బుధవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1998లో పెట్టిన ఎన్టీఆర్‌ పేరును మార్చాలని ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని, ఇప్పుడు ఆ మహనీయుడి పేరును మార్చాలనే పిచ్చి ఆలోచనను సీఎం జగన్‌ మానుకోవాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌, జగన్‌ తప్ప మరో పేరు ఉండకూడదా అని ప్రశ్నించారు. పరిపాలన సక్రమంగా చేస్తూ ఆర్థిక వనరులను పెంపొందించుకోవాలి కానీ ఇటువంటి చేతకాని పనులు చేయకూడదన్నారు. ఎంతో మంచి ఆశయంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సి టీని ఏర్పాటుచేస్తే దాన్ని నిర్వీర్యం చేసే దిశగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆ మహనీయుడిపై వైసీపీ చేస్తున్న చవకబారు ఆరోపణలు మానుకోవాలన్నారు. వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజా సూరిబాబురాజు, కాకినాడ రామారావు, కొత్తిం వెంకట శ్రీనివాసరావు, ఎలిశెట్టి నాని, మేడిది శ్రీనివాస్‌, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గుత్తుల సూర్యావతి పాల్గొన్నారు.



Updated Date - 2022-09-29T06:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising