ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యం ఖరీదు.. కోట్లు

ABN, First Publish Date - 2022-08-06T06:56:58+05:30

సామర్లకోట మున్సిపాల్టీలో పనిచేస్తున్న అధికారులు, ప్రధానంగా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా మున్సిపాల్టీకి రావాల్సిన కోట్లాది రూపాయల మేర ఆదా యానికి గండిపడినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, ఆగస్టు 5: సామర్లకోట మున్సిపాల్టీలో పనిచేస్తున్న అధికారులు, ప్రధానంగా టౌన్‌ప్లానింగ్‌ అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా మున్సిపాల్టీకి రావాల్సిన కోట్లాది రూపాయల మేర ఆదా యానికి గండిపడినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ ఏఎస్పీ సౌజన్య వెల్లడించారు. సామర్లకోట మున్సిపాల్టీలో రెండో రోజైన శుక్ర వారం సాయంత్రం వరకూ పలు ప్రాంతాల్లోని నూతన భవనాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు మున్సిపల్‌ కార్యాలయంలో సా యంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ సౌజన్య మాట్లాడుతూ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రూ.7కోట్ల మేర ఆదాయం రాకుండా పోయిందన్నారు, వీటిలో కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినా వాటికి పన్నులు విధిం చకుండా పాత గుడిసెలకు ఉన్న పన్నునే నేటికీ కొనసాగించడం, ప్రచారహోర్డింగ్‌లకు చెంది ఒక్క రూపాయి పన్ను కూడా వసూలు చేయకుండా ఉండడం వంటి చర్యలతో మున్సిపల్‌ ఆదాయానికి గండి పెట్టారన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తులను గృహావసర వినియోగం పేరిట నమోదుల చేసుకుని వాణిజ్యావసర వినియోగాలకు వాడుతూ మున్సిపాల్టీకి లక్షలాది రూపాయల ఆదా యానికి గండి పెట్టారన్నారు. మరికొన్ని భవనాల నిర్మాణాలకు అస లు అనుమతులు లేకుండా మూడేసి అంతస్తుల భవనాలు నిర్మించా రన్నారు. అలాగే టౌన్‌ ప్లానింగ్‌ బాటలోనే కొందరు సచివాలయ సిబ్బంది నడుస్తుండడాన్ని గుర్తించామన్నారు. తాము రెండ్రోజులపా టు నిర్వహించిన తనిఖీలపై నివేదికలను తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి నివేదించనున్నట్టు ఏఎస్పీ సౌజన్య తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు పుల్లారావు, భార్గవమహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-06T06:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising