ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌ఐవీ మరణాలు తగ్గించాలి..

ABN, First Publish Date - 2022-05-16T06:33:09+05:30

భవిష్యత్తులో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ మరణాల సంఖ్య పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అంతర్జాతీయ కొవ్వొత్తుల సంతాప దినం నిర్వహించడం జరుగుతుందని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఏఆర్‌టీ సెంటర్‌ ఇన్‌ఛార్జి వైద్యాధికారి డాక్టర్‌ యూజే.కిరణ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 15 :  భవిష్యత్తులో  హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ మరణాల సంఖ్య పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అంతర్జాతీయ కొవ్వొత్తుల సంతాప దినం నిర్వహించడం జరుగుతుందని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి ఏఆర్‌టీ సెంటర్‌ ఇన్‌ఛార్జి వైద్యాధికారి డాక్టర్‌ యూజే.కిరణ్‌ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌ వద్ద ఆదివారం కొవ్వొత్తుల సంతాప దినం నిర్వహించి ర్యాలీ చేపట్టారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పాల్‌ సతీష్‌ ముందుగా కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించారు. పిల్లలకు వైఆర్‌జీ కేర్‌ స్వచ్ఛంద సంస్థ న్యూట్రీషన్‌ అందజేశారు. హెచ్‌ఐవీతో మరణించిన వారి ఆత్మకు శాంతి  చేకూరాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షేర్‌ ఇండియా సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేవీ నరేష్‌, ఏఆర్‌టీ కౌన్సిలర్‌ టేకి సురేష్‌, టి.అంజలీదేవి, ఏ.మణికుమారి, ఎం.వెంకటలక్ష్మి, ఎం.సూర్యకుమారి, వి.దేవి, వెంకటేష్‌, కుమార్‌, ఏఆర్‌టి సిబ్బంది సిబ్బంది రాజశేఖర్‌, ప్రభాకర్‌, నాగలక్ష్మి, వనిత, రమేష్‌, సురేష్‌, ఆంజనేయప్రసాద్‌, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T06:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising