ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ప్రగతికి పరిశోధనలు ఎంతో అవసరం

ABN, First Publish Date - 2022-05-27T06:13:02+05:30

దేశ ప్రగతికి పరిశోధనలు ఎంతో అవసరమని జేఎన్టీయూకే రిజిసా్ట్రర్‌ డాక్టర్‌ ఎల్‌.సుమలత పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారంలోని రాజారత్న కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘నూతన పరిశోధనలు-పోకడల’పై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది.

జాతీయ సదస్సులో మాట్లాడుతున్న సుమలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, మే 26: దేశ ప్రగతికి పరిశోధనలు ఎంతో అవసరమని జేఎన్టీయూకే రిజిసా్ట్రర్‌ డాక్టర్‌ ఎల్‌.సుమలత పేర్కొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారంలోని రాజారత్న కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘నూతన పరిశోధనలు-పోకడల’పై రెండు రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ సుమలత మాట్లాడుతూ యువతరానికి పరిశోధనలపై మక్కువ కలిగింధ్యతను అధ్యాపకులు తీసుకోవాలని కోరారు. వైద్య కళాశాల ప్రొఫెసర్‌ డాక్టర్‌ రవిచంద్ర తాను చేసిన పరిశోధనలను వివరించారు. జీఎస్‌ఐ విశ్రాంత పరిశోధకుడు డాక్టర్‌ ఎంఎన్‌ రావ్‌ మాట్లాడుతూ విద్యను పరిశోధనాత్మకంగా అభ్యసించిన వారు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, లక్ష్యాలు సాధిస్తారని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ అంకం రాంబాబు మాట్లాడుతూ తమ విద్యార్థులకు పేరొందిన కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. డాక్టర్‌ అంకం రచించిన ‘గట్టిగా అనుకో పనైపోద్ది’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కిట్స్‌లో వృత్తి విద్యా కోర్సులు నడిపేందుకు వరంగల్‌ నిట్‌ విద్యార్థి సంఘం, హైదరాబాద్‌ కేపీ ఫౌండేషన్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు చైర్మన తెలిపారు. సదస్సులో సుమారు 500 మంది పరిశోధకులు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రత్నరాజు, డైరెక్టర్లు డాక్టర్‌ వెంకట్‌ బర్ల, పవన్‌కుమార్‌, ఏవో ఏఎన్వీ రవిధర్‌, వివిధ శాఖల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising