ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా గడప తొక్కద్దు

ABN, First Publish Date - 2022-07-01T06:28:51+05:30

‘రహదారులు అధ్వానంగా ఉన్నాయి.... డ్రైనేజీ వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంది.... అయి నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవట్లేదు... అభివృద్ధి చేయలేని మీరు మా ఇంటికి రానక్కర్లేదు’ అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యేకు తెగేసి చెప్పాడు.

ఎమ్మెల్యేను నిలదీస్తున్న వృద్ధుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే చిట్టిబాబుకు తెగేసి చెప్పిన వృద్ధుడు
  • మొసలపల్లిలో ‘గడప గడప’లో చుక్కెదురు
  • సమస్యలపై నిలదీసిన స్థానికులు, మహిళలు

అంబాజీపేట, జూన్‌ 30: ‘రహదారులు అధ్వానంగా ఉన్నాయి.... డ్రైనేజీ వ్యవస్ధ అస్తవ్యస్తంగా ఉంది.... అయి నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవట్లేదు... అభివృద్ధి చేయలేని మీరు మా ఇంటికి రానక్కర్లేదు’ అంటూ ఓ వృద్ధుడు ఎమ్మెల్యేకు తెగేసి చెప్పాడు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మండలంలోని మొసలపల్లి పర్యటించిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చుక్కెదురైంది. పలు కాలనీల్లో పర్యటించిన ఆయన్ను స్థానికులు నిలదీశారు. కట్టావారిపాలెంలో ఓ ఇంటికి వెళ్లగా అభివృద్ధి చేయలేని మీరు మా ఇంటికి రావద్దంటూ వృద్ధుడు కట్టా వెంకన్న స్పష్టం చేశాడు. సమస్య తెలియజేయాలని వెంకన్నను ఎమ్మెల్యే కోరగా కాలనీలో రహదారి, కాలువకు పాంచాల నిర్మించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదన్నాడు. మొసలపల్లి గరువులో రహదారుల కోసం మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. పర్యటనలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, సర్పంచ్‌ దంతులూరి ఉమాదేవి, నాయకులు దంతులూరి శ్రీనురాజు, నాగాబత్తుల శ్రీనివాస్‌, పేరి శ్రీను, నాగవరపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:28:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising