ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల నేరస్తుల అరెస్టు

ABN, First Publish Date - 2022-12-15T23:46:49+05:30

చెడు వ్యసనాలు, దురాలవాట్లకు బానిసలుగా మారిన నలుగురు మైనర్‌ బాలురు సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బైక్‌ల చోరీల బాట పట్టారు. ఎట్టకేలకు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 15: చెడు వ్యసనాలు, దురాలవాట్లకు బానిసలుగా మారిన నలుగురు మైనర్‌ బాలురు సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బైక్‌ల చోరీల బాట పట్టారు. ఎట్టకేలకు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. బాల నేరస్తుల నుంచి రూ. 7.10 లక్షల విలువైన 8 మోటార్‌ బైక్‌లను సర్పవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోటార్‌ బైక్‌ల చోరీల నివారణ కోసం ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తులు, చెడు నడవడిక గల వారిపై పోలీసు నిఘా ను పెంచారు. ఈ క్రమంలో బుధవారం కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి జంక్షన్‌ వద్ద సర్పవరం ఎస్‌హెచ్‌వో ఆకుల మురళీకృష్ణ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సతీష్‌బాబు, ఏఎస్‌ఐ ఎం.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు బాల నేరస్తుల గ్యాంగ్‌ సభ్యులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా బైక్‌ల చోరీల విషయం బయటపడినట్లు ఎస్‌డీపీవో పి.మురళీకృష్ణారెడ్డి తెలిపారు. బాల నేరస్తులు నలుగురు కాకినాడ సిటీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన 8 మోటార్‌ సైకిళ్ల చోరీల కేసులకు చెందిన బైక్‌లుగా గుర్తించామన్నారు. టూటౌన్‌ పీఎస్‌లో నమోదైన రెండు కేసులకు చెందిన ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాల నేరస్తులను సంబంధిత కోర్టులో రిమాండ్‌ నిమిత్తం తరలించామన్నారు. చోరీ సొత్తు స్వాధీనం, బాల నేరస్తుల గ్యాంగ్‌ను పట్టుకున్న ఎస్‌హెచ్‌వో, ఎస్‌ఐ, ఏఎస్‌ఐతో పాటు హెచ్‌సీలు గణేష్‌బాబు, సత్యనారాయణ, పీసీలు వాసంశెట్టి రాజేష్‌, హోంగార్డు కె.వెంకటరత్నంను ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-12-15T23:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising