ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకు న్యాయం చేయండి

ABN, First Publish Date - 2022-06-30T06:48:10+05:30

తుని మండలంలోని డి.పోలవరం గ్రామం లో మంత్రి కార్యక్రమంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రా మంలో నాడు-నేడు రెండో విడత పనుల్లో భాగంగా అదనపు తరగతి గదుల భవనానికి రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టిరాజా శంకు స్థాపన చేపట్టారు. ఆ స్థలంలో నివాసం ఉంటున్న పేరూరి నూకరాజు అనే వ్యక్తి ఇంటిని అధికారులు తొలగించి అక్కడ పాఠశాల భవన నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. తమను రోడ్డున పడేశారం టూ సంబంధింత కుటుంబీకులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రి కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఒక ఇంట్లో వారిని బంధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తరగతి గదుల భవనానికి మంత్రి రాజా శంకుస్థాపన
  • మా ఇంటిని కూల్చేసి శంకుస్థాపనలా..?
  • పెట్రోల్‌ పోసుకుని బాధిత కుటుంబం ఆత్మహత్యాయత్నం
  • అడ్డుకుని నిర్బంధించిన పోలీసులు 
  • డి.పోలవరంలో ఉద్రిక్తత

తునిరూరల్‌, జూన్‌ 29: తుని మండలంలోని డి.పోలవరం గ్రామం లో మంత్రి కార్యక్రమంలో బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రా మంలో నాడు-నేడు రెండో విడత పనుల్లో భాగంగా అదనపు తరగతి గదుల భవనానికి రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టిరాజా శంకు స్థాపన చేపట్టారు. ఆ స్థలంలో నివాసం ఉంటున్న పేరూరి నూకరాజు అనే వ్యక్తి ఇంటిని అధికారులు తొలగించి అక్కడ పాఠశాల భవన నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. తమను రోడ్డున పడేశారం టూ సంబంధింత కుటుంబీకులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రి కార్యక్రమం జరుగుతున్నంత సేపు ఒక ఇంట్లో వారిని బంధించారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధిత కుటుంబాలకు మంత్రి న్యాయం చేయనున్నారని సీఐ సన్యాసిరావు తెలిపారు. గురువారం మంత్రి కార్యాలయానికి బాధితులను రమ్మని మంత్రి చెప్పినట్లుగా వివరించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాము, జడ్పీటీసీ పోతలు సూర్యమణి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T06:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising