ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి బొత్స దృష్టికి సమస్యల వెల్లువ

ABN, First Publish Date - 2022-01-20T05:07:43+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 19: కాకినాడలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు బుధవారం పలుచోట్ల ప్రజలు సమస్యలు తెలియజేశారు. జగన్నాఽథపురం మహాలక్ష్మినగర్‌ శివారు నాయకర్‌ నగర్‌లో సుమారు 500 ఇళ్ల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని.. స్థానిక నాయకులు, అ

కాకినాడలో మంత్రి బొత్సకు సమస్యలు తెలియజేస్తున్న మహిళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌ (కాకినాడ), జనవరి 19: కాకినాడలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు బుధవారం పలుచోట్ల ప్రజలు సమస్యలు తెలియజేశారు. జగన్నాఽథపురం మహాలక్ష్మినగర్‌ శివారు నాయకర్‌ నగర్‌లో సుమారు 500 ఇళ్ల ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని.. స్థానిక నాయకులు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆప్రాంత మహిళలు మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికుల సమస్యలను తెలియజేస్తూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ అధికారులు, పాలకవర్గం, అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి వందకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నాయకులు వై.మాలకొండయ్య, కార్పొరేటర్‌ సాలిగ్రామ లక్ష్మీప్రసన్న మంత్రి దృష్టికి తెచ్చారు. సచివాలయాల్లోకి తీసుకోవడం వల్ల బిల్లు కలెక్టర్లు పదోన్నతులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర బిల్లు కలెక్టర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బిల్లు కలెక్టర్ల అసోసియేషన్‌ అఽధ్యక్షుడు శ్రీనివాస్‌, ఇతర  జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 


అభివృద్ధి పనుల ప్రారంభం

కాకినాడ రూరల్‌, జనవరి 19: కాకినాడ కార్పొరేషన్‌ 42వ డివిజన్‌ స్వామినగర్‌లో రూ.4 కోట్ల కాకినాడ స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. చినస్వామినగర్‌, స్వామినగర్‌లలో నూతనంగా సీసీరోడ్లు, కల్వర్టులు, సీసీ డ్రైన్లను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, స్వామినగర్‌ వైసీపీ ఇన్‌చార్జ్‌ కోరాడ దుర్గాప్రసాదరెడ్డి, ఎంపీపీ గోపిశెట్టి పద్మజాబాబ్జీ, రూరల్‌ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, కె.రాము తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T05:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising