ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు సహకరించడం లేదు

ABN, First Publish Date - 2022-07-01T06:32:50+05:30

కొంతమంది అధికారులు సహకరించకపోవడంతో పనులు సత్వరమే జరగడం లేదని తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ పవన్‌కుమార్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం మండల సమావేశంలో తహశీల్దార్‌ ఆవేదన


సీతానగరం, జూన్‌ 30 : కొంతమంది అధికారులు సహకరించకపోవడంతో పనులు సత్వరమే జరగడం లేదని తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ పవన్‌కుమార్‌ మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఆరోపించారు. సీతానగరం మండల పరిషత్‌ కార్యాలయంలో   గురువారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం గరం గరంగా జరిగింది. చినకొండేపూడిలో మల్టీ పర్పస్‌ స్పెసిలిటి సెంటర్‌కు స్ధలం గుర్తించామని, పంచాయతీ కార్యదర్శి దానిపై లెటర్‌ ఇవ్వాల్సి ఉందని ఎన్నిసార్లు ఫోన్‌ చేసిన స్పందించలేదన్నారు. పీఆర్‌ ఏఈ   కొండలరావు అందుబాటులో ఉండడం లేద న్నారు. దీంతో  కార్యదర్శి నాగ సత్యసాయి,  ఏఈ కొండలరావులు తమపై ఆరోపణలు సరికాదన్నారు.  ఎంపీడీవో రమేష్‌ జోక్యం చేసుకుని ప్రసంగం పూర్తయిన తరువాత మీ అభ్యంతరం తెలపాలని అనడంతో వారు వెనక్కి తగ్గారు. ఏడీఏ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ మండలానికి మూడు డ్రోనులు మం జూరయ్యాయని, ఒక్కొక్క డ్రోన్‌ ధర రూ10 లక్షలు ఉంటుందని, బ్యాంక్‌ రుణంతో సబ్సిడితో అందిస్తారని తెలిపారు. సీతానగరం సర్పంచ్‌ కోండ్రపు ముత్యాలు మాట్లాడుతూ ఈ క్రాప్‌లో అవకతవకలు జరిగాయన్నారు. దీనిపై ఏడీఏ స్పందించి హార్టికల్చర్‌ విషయంలో కొంత అవకతవకలు జరిగాయి, పామాయిల్‌ తోటలలో అరటి తోటలు ఉన్న ట్టు జరిగాయని ఇటువంటివి జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చల్లమల్ల వెంకటలక్ష్మి వైస్‌ఎంపీపీలు ముదునూరి సురేష్‌ రాజు, సత్యం మదన్‌బాబు, ఎంఈవో కె.స్వామినాయక్‌ ఎస్‌ఐ శుభశేఖర్‌  ,  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-01T06:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising