ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుని వదిలేశాడు..

ABN, First Publish Date - 2022-12-16T00:20:03+05:30

భర్తను వెతుక్కుంటూ భార్య వచ్చి ఆందోళనకు దిగింది.

చీపురుగూడెంలో భర్త కోసం ఆందోళన చేస్తున్న భార్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల,డిసెంబరు 15 : భర్తను వెతుక్కుంటూ భార్య వచ్చి ఆందోళనకు దిగింది. నల్లజర్ల మండలం చీపురుగూడెం గ్రామానికి చెందిన వసంతాడ అనిల్‌కుమార్‌, తెలంగాణలోని ఆశ్వారావుపేట మండలం నారా యణపురం గ్రామానికి చెందిన తమ్మిలేటి నాగరాణి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలిసి చదువుకున్నారు.నాలుగేళ్ల పాటు ప్రేమించుకుని చదువు పూర్తయ్యాక సికింద్రాబాద్‌ ఆర్య సమాజంలో గతేడాది డిసెంబరు 17వ తేదీన వివాహం చేసుకున్నారు.హైదరాబాద్‌ మియాపూర్‌లో 5 నెలలు కాపురం చేశారు. అనిల్‌కుమార్‌కి చెన్నైలో ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లిపో యాడు.అప్పటి నుంచి నాగరాణికి దూరంగా ఉంటు న్నాడు. ఈ నేపథ్యంలో గత నెల 10వ తేదీన ఆశ్వారావుపేట పోలీస్‌స్టేషన్‌లో నాగరాణి భర్త అనిల్‌కుమార్‌పై కేసు పెట్టింది. కొన్ని రోజులు గడువు కావాలని అబ్బాయి తరపు పెద్దలు కోరడంతో పోలీసులు గడువు ఇచ్చారు.ఇచ్చిన గడువు పూర్తయినా భర్త అనిల్‌కుమార్‌ పట్టించుకోకపోవడంతో గురువారం మహిళ సంఘ నాయకులతో కలిసి భర్త ఇంటికి వచ్చి ఆందోళన చేసింది.అనిల్‌ కుమార్‌ చెన్నైలో ఉండడం వల్ల ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇవ్వాలని పెద్దల సమక్షంలో తండ్రి వెంకటేశ్వరరావు కోరాడు. మహిళ సంఘాలు సమ్మతించడంతో ఆందోళన సద్దుమణిగింది.

Updated Date - 2022-12-16T00:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising