ఇక అంతా కుడా..!
ABN, First Publish Date - 2022-06-17T06:53:47+05:30
జిల్లాలో కాకినాడ నగర అభివృద్ధి సంస్థ(కుడా) పరిధిని అడ్డగోలుగా పెంచేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఉన్న విస్తీర్ణం చాలద న్నట్లుగా అదనంగా మరిన్ని మండలాలను, తీరప్రాంతాలను ఇందులో చేర్చడానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కుడా పరిధిలో చేరిన ప్రాంతా ల్లో ఇళ్ల నిర్మాణానికి, అమ్మకానికి, ఇతర భూముల కొనుగోలు, అమ్మకాల కు జనం నానా యాతనలు పడాల్సి వస్తోంది.
- ఇకపై కుడా పరిధిలోకి మొత్తం కాకినాడ జిల్లా
- జిల్లాల విభజన నేపథ్యంలో పరిధిని పెంచుకునేందుకు కుడా కుయుక్తులు
- కొత్తగా 1265.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిపేసుకునేందుకు పావులు
- తుని నుంచి కాకినాడ వరకు తీరం వెంబడి 15గ్రామాలపైనా కన్ను
- పెదపూడిని డీనోటిఫై చేసి ఇటు తెచ్చేలా ప్రతిపాదనలు
- రామచంద్రపురం రూరల్, కాజులూరు, కె.గంగవరం మండలాలూ కుడాలోకే..
- అధికారులపై మంత్రులు రాజా, వేణు ఒత్తిళ్లు
- ప్రయత్నాలన్నీ ఫలిస్తే జిల్లాలో 2,501 చ.కి.మీ.కు విస్తరించనున్న కుడా పరిధి
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కాకినాడ నగర అభివృద్ధి సంస్థ(కుడా) పరిధిని అడ్డగోలుగా పెంచేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఉన్న విస్తీర్ణం చాలద న్నట్లుగా అదనంగా మరిన్ని మండలాలను, తీరప్రాంతాలను ఇందులో చేర్చడానికి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కుడా పరిధిలో చేరిన ప్రాంతా ల్లో ఇళ్ల నిర్మాణానికి, అమ్మకానికి, ఇతర భూముల కొనుగోలు, అమ్మకాల కు జనం నానా యాతనలు పడాల్సి వస్తోంది. కుడా అనుమతి లేకుండా ఏ లావాదేవీ నిర్వహించడానికి వీల్లేక అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో తగ్గిపోయిన విస్తీర్ణాన్ని భారీగా పెంచుకోవడానికి కుడా కుయుక్తులు పన్నుతోంది. దీనికి మంత్రు లు రాజా, వేణు తమ నుంచీ ప్రతిపాదనలు పంపడంతో సబ్‌ప్లాన్ ఏజె న్సీ మినహా జిల్లా మొత్తాన్ని తన పరిధిలోకి తెచ్చుకునేందుకు ప్రతిపా దనలు సిద్ధం చేస్తోంది. తద్వారా ఇప్పుడున్న 1236 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 2,501 చ.కి.మీ.కు పెంచడానికి ఫైలు రూపొందిస్తోంది.
అంతా కలిపేద్దాం..
జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావ రి నగర అభివృద్ధి సంస్థ(గుడా) తన కార్యకలాపాలు నిర్వహించింది. కాకి నాడనుంచి రాజమహేంద్రవరం, కోనసీమ వరకు అనేక మండలాలను గుడా పరిధిలోకి చేర్చి ఎక్కడికక్కడ అడ్డగోలుగా వ్యవహరించింది. ఈ ప్రాంతాల్లో భూములు, ఇళ్లు, లేఅవుట్‌లు అన్నీ తన అనుమతులతోనే జర గాలని నిబంధనలు విధించింది. మొత్తం 12 మున్సిపాల్టీలు, 42 మండలా లు, 591 గ్రామాలతో 4,390 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఆ తర్వాత జీవో నెంబరు 79ను హైకోర్టు కొట్టేయడంతో పరిధి 2,183 చ.కి.మీ. పరిమితమైంది. గతేడాది ఆగస్టులో రాష్ట్రప్రభుత్వం కొత్తగా రాజ మహేంద్రవరం కేంద్రంగా రుడా ఏర్పాటు చేయడంతో కుడా పరిధి తగ్గి పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాల విభజనతో కాకినాడ జిల్లా పరిధి 21 మండలాల్లో 2,779.40 చ.కి.మీ. వరకు ఏర్పడింది. కానీ కొత్త జిల్లా కాకినాడలో కుడా పరిధిలో కాకినాడ కార్పొరేషన్, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాల్టీలు, గొల్లప్రోలు నగర పంచాయతీ సహా 15 మండ లాల్లోని 175 గ్రామాలతో 1236 చ.కి.మీ. మాత్రమే విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా 1265 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కొత్తగా తన పరిధిలోకి చేర్చుకోవడానికి కుడా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మిగిలిపోయిన ప్రాంతాలు చేర్చేలా..
ప్రస్తుత పరిధి చాలా చిన్నగా ఉండడంతో ఆదాయం, పెత్తనం చిన్నగా ఉందని, దీనివల్ల మొత్తం పరిధి ఇంకా విస్తరించడానికి ముందుకు వ చ్చింది. అందుకోసం జిల్లాలో ఇంకా మిగిలిపోయిన కరప మండలంలోని 71.86 చ.కి.మీ., తాళ్లరేవులో 119.76, తొండంగిలో 53.81, శంఖవరంలో 51.88, ప్రత్తిపాడులో 97.84, జగ్గంపేట 93.79, ఏలేశ్వరం 97.34, రౌతు లపూడి 152.95, కోటనందూరు 112.44 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడాలో చేర్చడానికి వీలుగా పావులు కదుపుతోంది. రాజమహేంద్రవరం రుడా పరిధిలో ఉన్న అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడిని కూడా కుడాలో చేర్చడానికి ప్రతిపాదించింది. పెదపూడి కాకినాడ జిల్లాలో కలిసి నందున రుడానుంచి డీనోటిఫై చేసి ఆ మండలంలోని 106.37చ.కి.మీ విస్తీర్ణాన్ని కుడాలోకి తీసుకురావడానికి నిర్ణయించింది. కాజులూరులోని 116.37 చ.కి.మీ. విస్తీర్ణాన్ని కూడా కలిపేసుకోవాలని భావిస్తోంది. తద్వారా జిల్లాలో సబ్‌ప్లాన్ ఏజెన్సీ మినహా మొత్తం 1256.37 చదరపు కిలోమీటర్ల ఏరియాకు కుడాను విస్తరించడానికి గట్టిగా అడుగులు వేస్తోంది. మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు కూడా దీని వెనుక ఉండ డంతో కుడా తన కుయుక్తులను నెరవేర్చుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాకినాడనుంచి తుని వరకు తీరం వెంబ డి మూడు మండలాల్లో 15 గ్రామాలు విశాఖ పరిధిలోని పీసీపీఐఆర్ జోన్‌లో ఉన్నాయి. ఇక్కడ కారిడార్‌లో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు పీసీపీఐఆర్ జోన్‌గా వీటిని గుర్తించారు. ఇప్పుడు 15 గ్రామాల పరిధిలోని 277.67 చ.కి.మీ. ప్రాంతాన్ని కూడా కలిపేసుకోబోతోంది.
వాటిని కూడా..
రామచంద్రపురం నియోజకవర్గం అమలాపురం జిల్లాలో కలిసిపోయిం ది. కాజులూరును కాకినాడ జిల్లాలో కలిపారు. కానీ రామచంద్రపురం రూరల్, కె.గంగవరం మండలాలు కోనసీమ జిల్లాలోనే ఉన్నాయి. ఇవేవీ కుడా పరిధిలో లేవు. కాజులూరు మినహా మిగిలిన రామచంద్రపురం రూరల్, కె.గంగవరం అసలు కాకినాడ జిల్లాలో లేనందున కుడా పరిధి లోకి చేర్చడానికి లేదు. కానీ మంత్రి వేణు మాత్రం వీటిని కుడాలోకి తీసు కువచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ప్రాంతాలు కూడా పరిధిలో లేనందున పీఎంఏవై అర్బన్ బీఎల్‌సీ పథకం వర్తించడం లేదని, అందుకే వీటిని కుడాలో కలపాలని ఈ ఏడాది మార్చిలో మంత్రి వేణు రాష్ట్ర మున్సిపల్‌శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ విలీన ప్రతిపాదనల పై న్యాయ సలహా కోసం కుడా ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత సాధ్యాసాధ్యా లపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపనుంది.
Updated Date - 2022-06-17T06:53:47+05:30 IST