ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తపేట రెవెన్యూ డివిజన

ABN, First Publish Date - 2022-06-30T06:37:56+05:30

కోనసీమ జిల్లాలో ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేస్తూ ఫైనల్‌ నోటిఫికేషన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఏపీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ ఆదేశాలిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏడు మండలాలతో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  •  పది మండలాలతో అమలాపురం డివిజన, ఐదు మండలాలతో రామచంద్రపురం

అమలాపురం, జూన 29 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజనను ఏర్పాటు చేస్తూ ఫైనల్‌ నోటిఫికేషన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు ఏపీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ ఆదేశాలిచ్చారు. కోనసీమ జిల్లా పరిధిలోని 22 మండలాలను మూడు రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. దీనిలో భాగంగా గతంలో పదహారు మండలాలతో ఉండే అమలాపురం రెవెన్యూ డివిజనను పది మండలాలకే పరిమితం చేశారు. కొత్తగా ఆవిర్భవించిన కొత్తపేట రెవెన్యూ డివిజన పరిధిలోకి ఏడు మండలాలు వచ్చాయి, రామచంద్రపురం రెవెన్యూ డివిజన పరిధిని ఐదు మండలాలకు పరిమితం చేశారు. కొత్తగా ఆవిర్భవించిన కొత్తపేట రెవెన్యూ డివిజన పరిధిలోకి ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి మండలాలు వస్తాయి. రామచంద్రపురం రెవెన్యూ డివిజన పరిధిలోకి రామచంద్రపురం, కె.గంగవరం, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలు వస్తాయి. అమలాపురం రెవెన్యూ డివిజన పరిధిలోకి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తుం, అల్లవరం, రాజోలు మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాలు వస్తాయి. మూడు డివిజన్లను ఏర్పాటు చేస్తూ ఎట్టకేలకు ఉత్తర్వులు వచ్చాయి. దాంతో కొత్తపేట డివిజనను ఏర్పాటుచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.  

Updated Date - 2022-06-30T06:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising