ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శక్తి స్వరూపిణి కోట సత్తెమ్మ

ABN, First Publish Date - 2022-09-26T06:00:01+05:30

తిమ్మరాజుపాలెం కోటసత్తెమ్మ ఆలయంలో 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు పది రోజుల పాటు దేవీ నవరాత్రి మహో త్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు.

విద్యుద్దీపాలంకరణల మధ్య కోట సత్తెమ్మ ఆలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, సెప్టెంబరు 25 :  తిమ్మరాజుపాలెం  కోటసత్తెమ్మ ఆలయంలో 26 నుంచి వచ్చే నెల 5వ  తేదీ వరకు పది రోజుల పాటు దేవీ నవరాత్రి మహో త్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు వైదిక స్మార్త ఆగమ ఆచారం ప్రకారం ఫౌండర్‌ ఫ్యామిలి మెంబర్‌ దేవుల పల్లి రామసుబ్బరాయ శాస్ర్తి దంపతులు ఉత్సవాలు ప్రారం భిస్తారని ఆలయ ఈవో బళ్ల నీలకంఠం తెలిపారు. కోటసత్తెమ్మ శంకు చక్ర గధ అభయ హస్త యజ్ఞోప వేదధారిణిగా ఏకశిల స్వయంభు విగ్రహంతో త్రిశక్తి  స్వరూపిణిగా  వెలిశారు. అమ్మవారి ఆలయానికి        క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి.


ఇదీ ఆలయ చరిత్ర

పూర్వ నిడదవోలు పట్టణం నిరవధ్యపురాన్ని 11వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పాలించేవారు. వీరభద్ర చాణిక్యుడి కోటలో శక్తి స్వరూపిణిగా అమ్మవారు  పూజలం దుకునేది. కాలక్రమేణా చాళుక్యుల పాలన అంతమవడంతో అదృశ్యమైన అమ్మవారి విగ్రహం 1934వ సంవత్సరంలో నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి శాస్ర్తి పొలం దున్నుతుండగా బయ టపడింది.అనంతరం భూమి ఆసామికి అమ్మవారు  కలలో కనిపించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించాలని కోరడంతో అదే  ప్రదేశంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా కోటసత్తెమ్మ పేరు రోజురోజుకు వ్యాప్తి చెందుతూ వచ్చింది. జిల్లాలోనే అమ్మవారి ఆలయాల్లో తొమ్మిది అంతస్తుల రాజగోపురం కలిగిన ఏకైనా దేవాలయం కోటసత్తెమ్మ  ఆల యం.కోట సత్తెమ్మ ఆలయం నిడదవోలు రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ నుంచి  అమ్మవారి ఆలయం మూడు కిలో మీట ర్ల దూరంలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరం రైల్వే స్టేషన్‌ నుండి అమ్మవారి ఆలయానికి 26 కిలోమీటర్లు, అలాగే రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు నిడద వోలులో విడిదికి హోటళ్లు అందుబాటులో ఉంటాయి.


Updated Date - 2022-09-26T06:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising