ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడాలి రాజకీయ జీవితం నందమూరి కుటుంబ భిక్ష

ABN, First Publish Date - 2022-09-13T06:45:16+05:30

నందమూరి కుటుంబ సభ్యుల భిక్షతో రాజకీయ జీవితం ప్రారంభించిన నాని ఈవేళ నందమూరి కుటుంబాన్ని నిందించే స్థాయికి రావడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

కొడాలి నాని దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • బిక్కవోలులో మాజీ మంత్రి నాని దిష్టిబొమ్మ దహనం

బిక్కవోలు, సెప్టెంబరు 12: నందమూరి కుటుంబ సభ్యుల భిక్షతో రాజకీయ జీవితం ప్రారంభించిన నాని ఈవేళ నందమూరి కుటుంబాన్ని నిందించే స్థాయికి రావడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, కుటుంబ సభ్యులపై మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాయకులు నాని దిష్టిబొమ్మను బిక్కవోలు మెయిన్‌రోడ్‌లో దహనం చేశారు. అనంతరం గ్రామంలోని వంతెన వద్ద ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహం వరకూ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడ ఇటువంటి పదజాలాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించరన్నారు. నానిని సభ్యసమాజం బహిష్కరించే రోజు దగ్గరలోనే వుందని, అందరూ బహిష్కరించాలని ఈ సందర్భంగా తమ పార్టీ తరపున డిమాండ్‌ చేశారు. ప్రజా జీవితంలో ఉండే వ్యక్తి పద్ధతిగా, సంస్కారవంతంగా ప్రవర్తించాలని, అది మరచిపోయి ప్రవర్తిస్తే సహించేది లేదని రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి పడాల ఆదినారాయణరెడ్డి, తెలుగు మహిళాధికార ప్రతినిధి బేరా వేణమ్మ, వెంకటసుబ్బారెడ్డి, కర్రి శ్రీనివాసరావు, రామచంద్రరావు, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, చిరంజీవిరాజు, చింతా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T06:45:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising