ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన రైళ్ల నిలుపుదలకు ఆదేశాలివ్వండి

ABN, First Publish Date - 2022-08-10T05:27:22+05:30

కాకినాడ సిటీ, ఆగస్టు 9: పార్లమెంట్‌ పరిఽధిలో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధితో పాటు ప్రధాన రైళ్ల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ వంగా గీత కేంద్ర రైల్వేమం త్రిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి లేఖ అందజే

లేఖ అందజేస్తున్న ఎంపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ గీత లేఖ 

కాకినాడ సిటీ, ఆగస్టు 9: పార్లమెంట్‌ పరిఽధిలో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధితో పాటు ప్రధాన రైళ్ల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ వంగా గీత కేంద్ర రైల్వేమం త్రిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి లేఖ అందజేశారు. విజయవాడ-విశాఖపట్నం సెక్షన్‌లోని రాజమండ్రి-తుని మధ్య గల స్టేషన్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లగా కొన్ని ప్రతిపాదనలు కస్టమర్‌ సౌకర్యాలు ఆమోదించారన్నారు. ఈ ప్రతిపాదనల పనుల మంజూరు కోసం సికింద్రాబాద్‌ జోనల్‌ ఆఫీస్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలోని సంబంధిత అఽధికారులకు అవసరమైన సూచనలు చేయాలని కోరారు. అలాగే పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రధాన రైల్వేస్టేషన్లలో కొన్ని ముఖ్యమైన రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం నిలుపుదల చేయాలన్నారు. కాకినాడ టౌన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి న్యూఢిల్లీ వయా వారణాసి, జోధ్‌పూర్‌ వయా భిల్లాడి, కోల్‌కత్తాకు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్నారు. విశాఖపట్నం-జోఽధ్‌పూర్‌, విశాఖపట్నం-షాలిమార్‌ రైళ్లను కాకినాడ వరకు పొడిగించాలన్నారు. పిఠాపురం రైల్వేస్టేషన్‌లో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, రత్నాచల్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గొల్లప్రోలు రైల్వేస్టేషన్‌లో బొకారో ఎక్స్‌ప్రెస్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, సామర్లకోట జంక్షన్‌  రైల్వేస్టేషన్‌లో నాగవల్లి నాందేడ్‌, కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, కోకనాడ ఎక్స్‌ప్రెస్‌, తుని రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్‌, ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌, అన్నవరం రైల్వేస్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలుపుదల చేయాలని కోరారు.

Updated Date - 2022-08-10T05:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising