ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీజిల్‌ బంక్‌ మూసివేయించిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-07-06T06:00:00+05:30

కాకినాడ సిటీ, జూలై 5: ఎమ్మెల్యే ద్వారంపూడి తన కమిషన్ల కోసం ఫిషింగ్‌హార్బర్‌లోని ఆప్కాఫ్‌ డీజిల్‌ బంక్‌ను మూసివేయించి తన అనుచరులతో బయోడీజిల్‌ అధికరేట్లకు అమ్మిస్తున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. మత్ప్యకారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభు

తాళాలేసి ఉన్న బంక్‌ను చూపిస్తున్న కొండబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే కొండబాబు విమర్శ 

కాకినాడ సిటీ, జూలై 5: ఎమ్మెల్యే ద్వారంపూడి తన కమిషన్ల కోసం ఫిషింగ్‌హార్బర్‌లోని ఆప్కాఫ్‌ డీజిల్‌ బంక్‌ను మూసివేయించి తన అనుచరులతో బయోడీజిల్‌ అధికరేట్లకు అమ్మిస్తున్నారని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. మత్ప్యకారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఫిషర్‌మెన్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఫెడరేషన్‌ ద్వా రా సబ్సిడీ డీజిల్‌ అందించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మత్స్యకారులతో కలిసి ఫిషింగ్‌ హార్బర్‌లోని ఆప్కాఫ్‌ బంక్‌ వద్ద నిరసన తెలిపారు. కొండబాబు మాట్లాడుతూ ప్రైవేటు బంకు ల్లో డీజిల్‌ రేటు లీటర్‌ రూ.99 ఉండగా, ఆప్కాఫ్‌ బంక్‌లో అధికరేటుకు విక్రయిస్తుండటంతో మ త్స్యకారులు బోటు ఇంజన్లు చెడిపోతాయని తెలిసినా లీటర్‌ రూ.76కు బయోడీజిల్‌ కొనుక్కుని వేటకు వెళుతున్నారన్నారు. అయితే ఎమ్మెల్యే తన అనుచరులతో బయోడీజిల్‌ బంకులను సిండికేట్‌గా చేసి లీటర్‌ రూ.85కు అమ్మిస్తున్నారన్నారు. ప్రైవేటుబంకుల్లో డీజిల్‌ రేటు రూ.99.74పై ఆప్కాఫ్‌ ద్వారా సబ్సిడీ లీటర్‌కు రూ.9 తగ్గించి రూ.90.74కు అమ్మాలని, కాకినాడలో ఈ విధా నం అమలు జరగక మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు. ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం కాకినాడలో ఆప్కాఫ్‌ బంక్‌ను మూసి వేయించారని ఆరోపించారు. మత్స్యశాఖ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా ఎమ్మెల్యే తన కనుసన్నల్లో బయోడీజిల్‌ అధిక రేట్లకు అమ్ముకుని దోచుకుంటున్నారన్నారు. టీడీపీ హయంలో మత్స్యకారులకు సబ్సీడీ ద్వారా వలలు, ఇంజన్లు, ఇతరత్రా అందించగా జగన్‌ ప్రభుత్వం మత్స్యకారులను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. నిరసనలో బోటు యజమానులు పంతాడి రాజు, చింతా పేర్రాజు, పోర నాగేశ్వరరావు, కర్రి శ్రీను, చంటి, దర్మారావు, టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు వనమాడి ఉమాశంకర్‌, తుమ్మల రమేష్‌, చింతలపూడి రవి, ఎరిపల్లి రాము, చోడిపల్లి సతీ ష్‌, ప్రేమానందం, ఎస్‌కే రహీమ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising