ఎగ్జిబిషన్ ఎత్తేశారు.. అద్దె ఎగ్గొట్టారు!
ABN, First Publish Date - 2022-03-05T05:57:28+05:30
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 4: చెత్త, నీటి, ఇంటి పన్నులను ముక్కు పిండి సొమ్ములు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ యంత్రాంగం ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుల పట్ల మాత్రం ఉదారంగా వ్యవహరించింది. అద్దె రూపేణా రూ.5.51 లక్షలు రావాల్సి ఉన్నా పట్టించుకోకుండా వదిలే
కార్పొరేషన్‌కు రూ.5.51 లక్షల ఆదాయం నష్టం
పట్టించుకోని అధికారులు
కార్పొరేషన్ (కాకినాడ), మార్చి 4: చెత్త, నీటి, ఇంటి పన్నులను ముక్కు పిండి సొమ్ములు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ యంత్రాంగం ఓ ఎగ్జిబిషన్ నిర్వాహకుల పట్ల మాత్రం ఉదారంగా వ్యవహరించింది. అద్దె రూపేణా రూ.5.51 లక్షలు రావాల్సి ఉన్నా పట్టించుకోకుండా వదిలేసింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య ఆదిత్య ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు 2020 ఏప్రిల్ 25 నుంచి జూన్ 8 వరకు 45 రోజులపాటు కాకినాడ సినిమారోడ్‌లోని ఆనందభారతి గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రౌండ్‌కు రోజుకు రూ.10వేలు అద్దెగా నిర్ణయించగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు 2020 ఫిబ్రవరి 29న అడ్వాన్స్‌గా జీఎ్‌సటీతో కలిపి రూ.5.31 లక్షలు చెల్లించారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎగ్జిబిషన్ నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి 2021 సెప్టెంబరు 30న అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడంతో 2021 నవంబరు 14 నుంచి డిసెంబరు 28 వరకు 45 రోజులపాటు అనుమతి ఇచ్చారు. ఆనందభారతి గ్రౌండ్‌లో సినిమారోడ్ వైపు కొత్తగా షాపు రూమ్‌ల నిర్మాణ పనులకు ముందుగానే ఎగ్జిబిషన్ నిర్వహణ ఆపివేశారు. తిరిగి 2021 డిసెంబరు 21 నుంచి 2022 జనవరి 6 వరకు అనుమతి పొంది రూ.లక్ష 18 వేలు చెల్లించారు. ఈ గడువు ముగిసిన తర్వాత మరికొన్ని రోజులు అదనంగా జనవరి 23వరకు ఎగ్జిబిషన్ కొనసాగించారు. మొత్తంగా 120 రోజులు ఎగ్జిబిషన్ నిర్వాహకుల ఆధీనంలో గ్రౌండ్ ఉంది. రోజుకు రూ.10 వేలు చొప్పున రూ.12 లక్షలు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంది. అయితే అడ్వాన్‌గా చెల్లించిన రూ.5.31 లక్షలు, రెండో దఫా చెల్లించిన రూ.లక్ష 18 వేలు కలిపి మొత్తం రూ.6.49 లక్షలు మాత్రమే చెల్లించి బ్యాలెన్స్ మొత్తం రూ.5.51 లక్షలు చెల్లించకుండా రాజకీయ సిఫార్సులతో కార్పొరేషన్ ఆదాయానికి తూట్లు పొడిచినా అధికారులు చోద్యం చూస్తున్నారు.
Updated Date - 2022-03-05T05:57:28+05:30 IST