ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాధానాలతో సిద్ధం కావాలి

ABN, First Publish Date - 2022-03-18T05:45:53+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 17: కౌన్సిల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తే వివిధ అంశాలకు సమాధానాలతో సిద్ధం కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 19న జరగనున్న కౌన్సిల్‌ సమావేశంపై కమిషనర్‌ స్వప్నిల్‌ గురువారం వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. స్టాండింగ్‌ కమిటీలో ఆమోదించిన బడ్జెట్‌ ప్రతిపాదనలు, వివిధ అభివృద్ధి పనులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ కౌన్సిల్‌ సమావేశంపై కమిషనర్‌ సమీక్ష
కార్పొరేషన్‌ (కాకినాడ), మార్చి 17:
కౌన్సిల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తే వివిధ అంశాలకు సమాధానాలతో సిద్ధం కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 19న జరగనున్న కౌన్సిల్‌ సమావేశంపై కమిషనర్‌ స్వప్నిల్‌ గురువారం వివిధ విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. స్టాండింగ్‌ కమిటీలో ఆమోదించిన బడ్జెట్‌ ప్రతిపాదనలు, వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త పీఆర్‌సీ ప్రకారం కార్మికుల వేతనాల చెల్లింపు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, రెడ్‌క్రాస్‌ సంస్థకు సంబంధించిన మరికొన్ని అంశాలతో కౌన్సిల్‌ సమావేశం జరుగనుందన్నారు. గత కౌన్సిల్‌ సమావేశాన్ని ప్లాస్టిక్‌ ఫ్రీ కౌన్సిల్‌గా నిర్వహించామని, ఈసారి జీరో వేస్ట్‌ లంచ్‌గా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ సత్యనారాయణ, స్మార్ట్‌సిటీ చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు, ఎస్‌ఈ సత్యకుమారి, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, టీపీఆర్‌వో ఎం.కృష్ణమోహన్‌, సెక్రటరీ ఏసుబాబు, ఎంహెచ్‌వో డి.పృథ్వీచరణ్‌ పాల్గొన్నారు.


సకాలంలో పన్నులు చెల్లించాలి
నగర ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు కోరారు. పన్నుల వసూళ్లపై రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్‌వోలు, ఆర్‌ఐలు, అడ్మిన్‌లు, బిల్లు కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈనెల 31తో గడువు ముగుస్తున్నందున వెంటనే పన్నులు చెల్లించాలని కోరారు. మొండి బకాయిలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా 30 దుకాణాలకు జప్తు నోటీసులు, 203 కుళాయిల తొలగింపు చేపట్టామన్నారు. బకాయిలకు సంబంధించి 2860 మందికి రెడ్‌ నోటీసులు జారీ చేశామన్నారు. డిప్యూటీ కమిషనర్‌ సీహెచ్‌ సత్యనారాయణ, రెవెన్యూ అధికారులు చెక్కా రమణ, నిర్మలాకుమారి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సచివాలయ అడ్మిన్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T05:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising